షాకింగ్ న్యూస్ : ట్రాఫిక్ సౌండ్స్‌తో హార్ట్ఎటాక్.. బీకేర్‌ఫుల్ అంటున్న నిపుణులు!

ట్రాఫిక్ గురించి ఎంత చెప్పినా తక్కువే అయిపోతుంది. ఉదయం ఆఫీసుకు వెళ్లాలన్నా.. రాత్రి ఇంటికి వెళ్లాలన్నా ట్రాఫిక్‌‌ వలన చాలా సమస్యలు ఎర్కొంటున్నారు. రోడ్డు నిండా ఎక్కడికక్కడికి వాహనాలు నిలిచిపోయి

Update: 2024-04-30 14:05 GMT

దిశ, ఫీచర్స్ : ట్రాఫిక్ గురించి ఎంత చెప్పినా తక్కువే అయిపోతుంది. ఉదయం ఆఫీసుకు వెళ్లాలన్నా.. రాత్రి ఇంటికి వెళ్లాలన్నా ట్రాఫిక్‌‌ వలన చాలా సమస్యలు ఎర్కొంటున్నారు. రోడ్డు నిండా ఎక్కడికక్కడికి వాహనాలు నిలిచిపోయి, 10 నిమిషాల దూరానికి కూడా గంట సేపు వేయిట్ చేసే పరిస్థితులు ఎదురు అవుతున్నాయి. దీని వలన ఆఫీసుకు వెళ్లే వారు ఉదయం 10 గంటలకు ఆఫీసు ఉంటే, 8.30కే బయలుదేరే పరిస్థితులు వచ్చాయి. ఈ ట్రాఫిక్ వలన చాలా మంది సతమతం అయిపోతుంటారు. ఇంకొంత మంది అయితే గంటలు తరబడి ట్రాఫిక్‌లో ఉండటం వలన నీరస, అలసటకు లోను అవుతుంటారు. అంతే కాకుండా కొంత మంది తమ ఫ్యామిలీతో ఎక్కువ సేపు గడపలేకపోతున్నామనే బాధతో, మానసికంగా కుంగిపోతుంటారు.ఇక ఇవన్నీ బాధలు చాలవు అన్నట్లు, తాజాగా చేసిన ఓ అధ్యయనంలో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయంట. ట్రాఫిక్​ శబ్ధంవల్ల గుండె సమస్యలు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని శాస్త్రవేత్తలు తెలిపారు.

కొంత మంది త్వరగా ఆఫీసుకు వెళ్లాలని టిఫిన్ కూడా చేయకుండా త్వర త్వరగా వచ్చేస్తుంటారు. దీంతో సిగ్నల్ పడిందంటే అంతే ఇక, మన చుట్టూ ఉన్నవారు చిన్న సందు చూసి వెళ్లిపోదామని, హారన్స్ కొడుతూ ఇబ్బంది పెడుతారు. అయితే ఈ ట్రాఫిక్ సౌండే మన గుండెకు భారంగా మారుతోందంట. కొన్నిరకాల గుండె జబ్బులు, వాటి ప్రమాద కారకాలపైన పరిశోధకులు అధ్యయనం చేయగా,అందులో ట్రాఫిక్ సౌండ్స్​ వల్ల గుండె సమస్యలు బాగా పెరుగుతున్నాయని, ట్రాఫిక్ సౌండ్స్​ ప్రతి 10 డెసిబుల్స్ పెరుగుదల అనేది గుండె సంబంధింత వ్యాధుల ప్రమాదాన్ని 3.2 శాతం పెంచుతుందని ఈ అధ్యయనంలో కనుగొన్నారు. సర్క్యులేషన్ రీసెర్చ్ జర్నల్​లో దీని గురించి పూర్తిగా వివరించారు.

అలాగే నైట్ టైమ్‌లో ట్రాఫిక్ సౌండ్ వలన ఒత్తిడి పెరిగిపోయి, మానసిక ఒత్తిడి పెరుగుతుందని, దీని కారణంగా రక్తపోటు, వాపు, వాస్కులర్ వ్యాధులను ఇది పెంచుతుందని, అలాగే డయాబెటీస్ ముప్పు కూడా ఉందని పరిశోధకులు తెలిపారు. అందువలన అందుకే జనసాంద్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో రద్దీగా ఉండే రోడ్లలో నో హార్న్ అనే బోర్డులు ఏర్పాటు చేయడం వల్ల ట్రాఫిక్ సౌండ్​ను కంట్రోల్ చేయవచ్చని, దీని వలన ప్రజారోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకున్నట్లు ఉంటుదంటున్నారు. అలాగే ప్రజారోగ్యంలో భాగంగా.. శబ్ధ నియంత్రణ చర్యలు ప్రభుత్వాలు తీసుకోవాలని పరిశోధకులు చెప్తున్నారు.

Similar News