లేజర్ బీమ్‌తో గడ్డిని కత్తిరించే రోబో.. ఆవిష్కరించిన యూట్యూబర్

పచ్చిక లేదా అడవి గడ్డిని కత్తిరించేందుకు సాధారణంగా లాన్‌మూవర్స్, కటింగ్ వీల్స్, కొడవళ్లు, కత్తులు వంటి సాధనాలనే ఎక్కువగా ఉపయోగిస్తారు.

Update: 2022-10-03 07:39 GMT

దిశ, ఫీచర్స్ : పచ్చిక లేదా అడవి గడ్డిని కత్తిరించేందుకు సాధారణంగా లాన్‌మూవర్స్, కటింగ్ వీల్స్, కొడవళ్లు, కత్తులు వంటి సాధనాలనే ఎక్కువగా ఉపయోగిస్తారు. అయితే లాన్‌మూవర్ బ్లేడ్స్ మొండిగా తయారైనా లేదా అరిగిపోయినా ఆ గడ్డిని కత్తిరించడం కష్టమై, రెట్టింపు సమయాన్ని వెచ్చించాల్సి ఉంటుంది. ఇలాంటి కష్టాలకు చెక్ పెడుతూ ఒక యూట్యూబర్ 'హై పవర్ లేజర్ బీమ్‌'తో గడ్డిని కత్తిరించే యంత్రాన్ని ఆవిష్కరించాడు.

'rctestflight' యూట్యూబ్ చానెల్ నిర్వహిస్తున్న డేనియల్ రిలేకు కొత్త వస్తువులను నిర్మించడమంటే మహా ఆసక్తి. ఈ చానెల్‌లో అతని వీడియోలన్నీ విశిష్టమైన సాంకేతిక ఆవిష్కరణలకు సంబంధించినవే. ఇలా కష్టతర విషయాలను సులభంచేస్తున్న అతడి ఆవిష్కరణలు వేలాది మంది అభిమానుల నుంచి ప్రశంసలు పొందుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇటీవల పెద్దగా శారీరక శ్రమ కలిగించకుండా పచ్చిక గడ్డిని కత్తిరించగలిగే యంత్రాన్ని ఎటువంటి స్పిన్నింగ్ బ్లేడ్స్ ఉపయోగించకుండా తయారుచేశాడు.

ఈ ప్రయోగం కోసం 40-వాట్ కట్టింగ్ లేజర్‌ను(లేజర్ పాయింటర్ కంటే దాదాపు 8,000 రెట్లు శక్తివంతమైనది) ఉపయోగించాడు రిలే. అయితే గడ్డిని త్వరగా, సమర్థవంతంగా కత్తిరించేందుకు చాలా ట్వీక్స్ అవసరమని గ్రహించి లేజర్‌ను 3D-పాయింటెడ్ గింబాల్‌కు జోడించాడు. తద్వారా దీన్ని సులభంగా తిప్పవచ్చు. ఈ మెషిన్ పవర్‌ను మొదట పరీక్షించినపుడు లేజర్.. గడ్డిని కత్తిరించకుండా కాల్చేస్తున్నట్లు కనుగొన్నాడు. కాగా చాలా సర్దుబాట్ల తర్వాత లేజర్ వాటిని కత్తిరించే విధంగా వాక్యూమ్‌ను సృష్టించగలిగాడు. ఇక ఈ పవర్‌ఫుల్ లాన్‌మూవర్ నుంచి వెలువడే లేజర్ ఒకరి వేలిని కత్తిరించదు గానీ కనుబొమ్మను తాకినట్లయితే అంధులయ్యే అవకాశముందని చెప్పాడు.

Tags:    

Similar News