మరో గ్రహంపై జీవం ఉనికి.. జేమ్స్ వెబ్ టెలిస్కోప్ ద్వారా గుర్తించిన సైంటిస్టులు

అంతు పట్టని విశ్వ రహస్యాల ఛేదనకు కొనసాగుతున్న అన్వేషణ ఇప్పటిది కాదు, దశాబ్దాల కాలంగా శాస్త్రవేత్తలు అనేక అంశాలపై పరిశోధనలు నిర్వహిస్తున్నారు. భూమి మాదిరి జీవం ఉనికి కలిగిన మరో గ్రహాన్ని గుర్తించడానికి ప్రయత్నిస్తూనే ఉన్నారు.

Update: 2024-04-29 13:22 GMT

దిశ, ఫీచర్స్ : అంతు పట్టని విశ్వ రహస్యాల ఛేదనకు కొనసాగుతున్న అన్వేషణ ఇప్పటిది కాదు, దశాబ్దాల కాలంగా శాస్త్రవేత్తలు అనేక అంశాలపై పరిశోధనలు నిర్వహిస్తున్నారు. భూమి మాదిరి జీవం ఉనికి కలిగిన మరో గ్రహాన్ని గుర్తించడానికి ప్రయత్నిస్తూనే ఉన్నారు. కానీ ఎక్కడా భూగోళం లాంటి గ్రహం ఉన్నట్లు సైంటిఫిక్ ఎవిడెన్స్ అయితే ఇప్పటి వరకూ లభించలేదు. కానీ ఇటీవల నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ (నాసా) భూమిని పోలిని పలు లక్షణాలు కలిగిన గ్రహాలను జేమ్స్ వెబ్ టెలిస్కోప్ ద్వారా గుర్తించింది.

నక్షత్ర మండలంలోని సూదూర ప్రాంతంలో ఓ గ్రహంపై జీవం ఉండే అవకాశం ఉన్నట్లు ప్రాథమిక ఆధారాలు లభించాయని నాసా సైంటిస్టులు అంటున్నారు. అయితే కొత్తగా గుర్తించిన ఈ రెడ్ డ్వార్ఫ్ స్టార్‌కు కె2-18బి అనే పేరు పెట్టారు. కానీ పూర్తిస్థాయి సమాచారాన్ని మరింత క్షుణ్ణంగా పరిశీలించాల్సిన అవసరం కూడా ఉందని పరిశోధకులు అంటున్నారు. జేమ్స్ వెబ్ టెలిస్కోప్ ద్వారా అందిన సమాచారం మేరకైతే కె2-18 అనే నక్షత్రంపై డైమిథైల్ సల్ఫైడ్ (డీఎంఎస్) ఆనవాళ్లు ఉన్నాయని, ఇది కేవలం ప్రాణకోటివల్ల మాత్రమే ప్రొడ్యూస్ అవుతాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. దీంతో అక్కడ జీవం ఉండే అవకాశం ఉందనే వాదనలకు బలం చేకూరుతోంది. కాగా జేమ్స్ వెబ్ టెలిస్కోప్ ద్వారా గుర్తించిన ఈ కొత్త నక్షత్రం ( కె2-18 ) భూమికి 124 కాంతి సంవత్సరాల దూరంలో ఉందని, ఇక్కడికి చేరుకోవడానికి సుమారు 22 లక్షల సంవత్సరాలకు పైగా పడుతుందని సైంటిస్టులు అంచనా వేస్తున్నారు.

Similar News