పాము పడగలో నిజంగానే నాగమణి ఉంటుందా?

పాముల గురించి ఏ విషయం అయినా సరే చాలా ఇంట్రెస్ట్‌గా తెలుసుకుంటాం.పాము అంటే ఎంత భయపడుతామో, వాటి గురించి తెలుసుకోవడానికి అంతకంటే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుంటాం. అయితే మనం

Update: 2024-03-29 09:53 GMT

దిశ, ఫీచర్స్ : పాముల గురించి ఏ విషయం అయినా సరే చాలా ఇంట్రెస్ట్‌గా తెలుసుకుంటాం.పాము అంటే ఎంత భయపడుతామో, వాటి గురించి తెలుసుకోవడానికి అంతకంటే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుంటాం. అయితే మనం మన చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు చాలా సీరియల్స్, సినిమాల్లో చూసి ఉంటాం. పాముల్లో నాగమణి ఉండటం, దాని గురించి పెద్ద ఫైట్స్, ఆ మూవీ లేదా సీరియల్స్ కథ మొత్తం నాగమణి చుట్టే తిరగడం. మరి నిజంగానే నాగమణి ఉంటుందా? దీని గురించి నిపుణులు ఏమంటున్నారు తెలుసుకుందాం.

కింగ్ కోబ్రా తన పడగలో నాగమణిని దాచుకుంటుంది అంటుంటారు. ముఖ్యంగా స్వాతి నక్షత్రం సమయంలో వర్షపు బిందువులు కింగ్ కోబ్రా నోటిలోకి ప్రవేశించినప్పుడు, నాగమణి ఏర్పడుతుందని చెప్తుంటారు. కానీ జియాలజీ ప్రకారం, అసలు నాగమణి అనేదే లేదు అని అంటున్నారు నిపుణులు. నాగమణి ఉన్నది అనేదానికి ఎలాంటి శాస్త్రీయ ఆధారం లేదని ఇదో మూఢనమ్మకం అని వారు కొట్టి పారేస్తున్నారు. అయితే మనుషులలా పాముల్లో కూడా పిత్తాశయంలో రాళ్లు ఉంటాయని వాటిని రత్నాలులా భావించి కొందరు పొరపాటు పడుతుంటారు. ఇదంతా అపోహ మాత్రమే నాగమణి అనేది లేదు అని ఐఎఫ్ఎస్ అధికారి సుధా రామన్ చెప్పుకొస్తున్నారు.

Similar News