విదేశీ ఉద్యోగార్థులకు వ్యాక్సిన్ ఇవ్వండి..!

దిశ, తెలంగాణ బ్యూరో: విదేశీ ఉద్యోగార్థులకు, సెలవుపై వచ్చినవారికి ప్రాధాన్యతతో కొవిడ్ 19 టీకాలు ఇవ్వాలని ఓవర్సీస్ మ్యాన్‌పవర్ రిక్రూట్స్ అసోసియేషన్ సీఎం కేసీఆర్‌కు లేఖ రాసింది. విదేశాలకు వెళ్లే విద్యార్థులకు ప్రాధాన్యత ఇచ్చిన టీకాలు వేసినట్టుగా విదేశాల్లో ఉద్యోగానికి వెళ్లేవారికి, సెలవులపై వచ్చిన వారికి టీకాలు వేయాలని అసోసియేషన్ అధ్యక్షులు డిఎస్ రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. కేరళ తరహాలో టీకా సర్టిఫికెట్‌లో పాస్‌పోర్ట్ నంబర్‌ను చేర్చాలని కోరారు. విదేశాలకు కొత్తగా ఉద్యోగం కోసం వెళ్లాలనుకునే ఆశావహులు, విదేశాల […]

Update: 2021-06-08 07:38 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: విదేశీ ఉద్యోగార్థులకు, సెలవుపై వచ్చినవారికి ప్రాధాన్యతతో కొవిడ్ 19 టీకాలు ఇవ్వాలని ఓవర్సీస్ మ్యాన్‌పవర్ రిక్రూట్స్ అసోసియేషన్ సీఎం కేసీఆర్‌కు లేఖ రాసింది. విదేశాలకు వెళ్లే విద్యార్థులకు ప్రాధాన్యత ఇచ్చిన టీకాలు వేసినట్టుగా విదేశాల్లో ఉద్యోగానికి వెళ్లేవారికి, సెలవులపై వచ్చిన వారికి టీకాలు వేయాలని అసోసియేషన్ అధ్యక్షులు డిఎస్ రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. కేరళ తరహాలో టీకా సర్టిఫికెట్‌లో పాస్‌పోర్ట్ నంబర్‌ను చేర్చాలని కోరారు. విదేశాలకు కొత్తగా ఉద్యోగం కోసం వెళ్లాలనుకునే ఆశావహులు, విదేశాల నుంచి సెలవుపై వచ్చిన లక్షలాది మంది భారతీయ పౌరులు కొవిడ్19 పరిమితుల కారణంగా ప్రయాణించలేని పరిస్థితిలో ఉన్నారని తెలిపారు. టీకాలు తీసుకున్న ప్రయాణికుల ప్రవేశాన్ని గల్ఫ్ దేశాలు అనుమతిస్తున్నాయని, ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) అనుమతించిన ‘కోవిషీల్డ్’ వాక్సిన్ భారత్ లో అందుబాటులో ఉన్నందున త్వరితగతిన టీకాను అందించాలని విజ్ణప్తి చేశారు. సకాలంలో ప్రయాణించకుంటే పొరుగు దేశాల్లో ఉద్యోగ అవకాశాలు కోల్పోయే అవకాశమున్నదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

Tags:    

Similar News