మట్టపల్లి నరసింహస్వామికి మళ్లీ ముప్పు!

దిశ, హుజూర్ నగర్: తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల భక్తుల పాలిట కొంగు బంగారమైన జిల్లాలోని మట్టపల్లి లక్ష్మీనరసింహస్వామి ఆలయం మరోసారి పులిచింతల బ్యాక్ వాటర్ లో ముంపునకు గురి కానుంది. గత ఏడాది సుమారు రెండు నెలలకు పైగా ఆలయం ముంపునకు గురి కావడంతో సూర్యాపేట, నల్లగొండ, ఖమ్మం, కృష్ణ, జిల్లాల భక్తులతోపాటు ఆంధ్రాలోని గుంటూరు, ప్రకాశం, జిల్లాల భక్తులు స్వామివారి దర్శనానికి దూరమయ్యారు. ఆలయ పాలకవర్గం, ధర్మకర్తల, చెన్నూరు విజయ్ కుమార్, మట్టపల్లి రావు, […]

Update: 2020-08-21 02:11 GMT

దిశ, హుజూర్ నగర్: తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల భక్తుల పాలిట కొంగు బంగారమైన జిల్లాలోని మట్టపల్లి లక్ష్మీనరసింహస్వామి ఆలయం మరోసారి పులిచింతల బ్యాక్ వాటర్ లో ముంపునకు గురి కానుంది. గత ఏడాది సుమారు రెండు నెలలకు పైగా ఆలయం ముంపునకు గురి కావడంతో సూర్యాపేట, నల్లగొండ, ఖమ్మం, కృష్ణ, జిల్లాల భక్తులతోపాటు ఆంధ్రాలోని గుంటూరు, ప్రకాశం, జిల్లాల భక్తులు స్వామివారి దర్శనానికి దూరమయ్యారు.

ఆలయ పాలకవర్గం, ధర్మకర్తల, చెన్నూరు విజయ్ కుమార్, మట్టపల్లి రావు, ఆనాటి ఈవో ఉదయ భాస్కర్ తెలంగాణ, ఆంధ్ర ప్రభుత్వాలకు పులిచింతల ప్రాజెక్టు ఇంజనీర్లకు ఫిర్యాదు చేయగా అధికారులు మొక్కుబడిగా పరిశీలించి వెళ్లారు. నివారణ చర్యలు చేపట్టలేదు. మరోసారి ఆలయం ముంపుకు గురికాకుండా పెద్ద విద్యుత్ మోటార్లను అమర్చి నీటిని తొలగించాలని భక్తులు కోరుతున్నారు.

Tags:    

Similar News