యాక్షన్‌లోకి అమిత్ షా.. ప్రతిష్టాత్మక పార్లమెంట్ సెగ్మెంట్లో ప్రచారం..!

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా బుధవారం తెలంగాణలో పర్యటించనున్నారు. హైదరాబాద్ అభ్యర్థి మాధవీలతకు మద్దతుగా నగరంలో

Update: 2024-04-30 17:27 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా బుధవారం తెలంగాణలో పర్యటించనున్నారు. హైదరాబాద్ అభ్యర్థి మాధవీలతకు మద్దతుగా నగరంలో రోడ్ షో నిర్వహించనున్నారు. బుధవారం సాయంత్రం 4.30గంటలకు మహంకాళి ఆలయం లాల్ దర్వాజ నుంచి శాలిబండ సుధా థియేటర్ వరకు వరకు ఈ ర్యాలీ నిర్వహించనున్నారు. ఈ ర్యాలీ అనంతరం అమిత్ షా నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి రానున్నారు. స్టేట్ ఆఫీస్‌లో ముఖ్య నేతలతో ఆయన భేటీ అవుతారు. ఎన్నికల నేపథ్యంలో ఆయన పలు అంశాలపై దిశానిర్దేశం చేయనున్నట్లు తెలుస్తోంది.

స్థానిక రాజకీయ పరిస్థితులపైనా ఆయన ఆరా తీయనున్నట్లు సమాచారం. పార్టీ ఎన్ని స్థానాల్లో గెలుస్తుంది..? ఎన్ని స్థానాల్లో వీక్‌గా ఉందనే అంశాలపై ఆరా తీసే అవకాశముంది. తెలంగాణలో డబుల్ డిజిట్ స్థానాల్లో గెలవాలనే లక్ష్యంతో బీజేపీ వెళ్తోంది. ఈనేపథ్యంలో ఈ భేటీ కీలకంగా మారనుంది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా స్టేట్ ఆఫీస్‌కు వస్తున్న నేపథ్యంలో కేంద్ర బలగాలు రాష్ట్రానికి ముందుగానే చేరుకున్నాయి. రాష్ట్ర కార్యాలయంలో తనిఖీలు నిర్వహించాయి. భద్రతాపరమైన చర్యలను తీసుకున్నారు.

అమిత్ షా షెడ్యూల్ ఇదే..

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా బుధవారం సాయంత్రం 7:40 గంటలకు హైదరాబాద్‌కు చేరుకుంటారు. 7:55కి లాల్ దర్వాజ మహంకాళి అమ్మవారిని దర్శించుకుటారు. అనంతరం లాల్ దర్వాజా నెహ్రూ విగ్రహం నుంచి సుధా థియేటర్ వరకు జరిగే రొడ్ షో లో పాల్గొంటారు. రోడ్ షో అనంతరం రాత్రి 9:15 నిమిషాలకు బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి చేరుకుంటారు. అక్కడ ముఖ్య నేతలతో సమావేశం నిర్వహిస్తారు. అనంతరం రాత్రి 10:30 గంటలకు ఐటీసీ కాకతీయకు షా చేరుకుంటారు.


Similar News