బ్రేకింగ్ : సమంత పిటిషన్‌పై విచారణ.. అది కరెక్ట్ కాదంటూ కోర్టు కీలక వ్యాఖ్యలు

దిశ, డైనమిక్ బ్యూరో : సోషల్ మీడియాలో తనపై అసత్య ప్రచారాలు చేస్తున్నారంటూ సినీ నటి సమంత కూకట్‌పల్లి కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో రెండు యూట్యూబ్ ఛానళ్లు, డాక్లర్ సీఎల్ వెంక్రటావులు తనపై అసత్య ప్రచారం చేశారని వారిపై ఇంజక్షన్ ఆర్డర్ ఇవ్వాలని సమంత కోర్టును కోరింది. దీనిపై పూర్తి విచారణ అనంతరం మంగళవారం కూకట్‌పల్లి కోర్టు తీర్పును వెలువరించింది. నటి సమంతకు సంబంధించి వ్యక్తిగత వివరాలు ఎవరూ ప్రసారం చేసేందుకు వీలులేదని […]

Update: 2021-10-26 07:18 GMT

దిశ, డైనమిక్ బ్యూరో : సోషల్ మీడియాలో తనపై అసత్య ప్రచారాలు చేస్తున్నారంటూ సినీ నటి సమంత కూకట్‌పల్లి కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో రెండు యూట్యూబ్ ఛానళ్లు, డాక్లర్ సీఎల్ వెంక్రటావులు తనపై అసత్య ప్రచారం చేశారని వారిపై ఇంజక్షన్ ఆర్డర్ ఇవ్వాలని సమంత కోర్టును కోరింది. దీనిపై పూర్తి విచారణ అనంతరం మంగళవారం కూకట్‌పల్లి కోర్టు తీర్పును వెలువరించింది.

నటి సమంతకు సంబంధించి వ్యక్తిగత వివరాలు ఎవరూ ప్రసారం చేసేందుకు వీలులేదని తీర్పునిచ్చింది. అంతేకాకుండా, సమంత కూడా తన వ్యక్తిగత వివరాలు సోషల్ మీడియాలో పోస్ట్ చేయొద్దని మందలించింది. యూట్యూబ్ ఛానళ్లలో వీడియో లింక్స్‌ను వెంటనే తొలగించాలని కోర్టు ఆదేశించింది.

Tags:    

Similar News