నో డౌట్.. ‘క్రాక్’ హిట్ అనిపించిన ట్రైలర్

దిశ, వెబ్‌డెస్క్: మాస్ మహారాజ రవితేజ క్రాక్ ట్రైలర్ వచ్చేసింది. పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పోతరాజు వీరశంకర్‌గా రవితేజ ఊరమాస్ ఖాకీ లుక్ అదిరిపోగా.. ‘జేబులో ఉండాల్సిన నోటు, చెట్టుకుండాల్సిన కాయ, గోడకుండాల్సిన మేకు’తో ఒంగోలును వణికిస్తున్న ముగ్గురు రౌడీల తాట ఎలా తీశాడు? అనేది కథ. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వస్తున్న సినిమాలో డైలాగ్స్ ఓ రేంజ్‌లో ఉండగా.. బ్యాక్ గ్రౌండ్ అనే కూతకూస్తే బ్యాలెన్స్ తప్పే క్వాలిటీ ఉన్న పోలీస్ ఆఫీసర్‌గా ట్రైలర్‌లో మాస్ […]

Update: 2021-01-01 01:39 GMT

దిశ, వెబ్‌డెస్క్: మాస్ మహారాజ రవితేజ క్రాక్ ట్రైలర్ వచ్చేసింది. పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పోతరాజు వీరశంకర్‌గా రవితేజ ఊరమాస్ ఖాకీ లుక్ అదిరిపోగా.. ‘జేబులో ఉండాల్సిన నోటు, చెట్టుకుండాల్సిన కాయ, గోడకుండాల్సిన మేకు’తో ఒంగోలును వణికిస్తున్న ముగ్గురు రౌడీల తాట ఎలా తీశాడు? అనేది కథ. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వస్తున్న సినిమాలో డైలాగ్స్ ఓ రేంజ్‌లో ఉండగా.. బ్యాక్ గ్రౌండ్ అనే కూతకూస్తే బ్యాలెన్స్ తప్పే క్వాలిటీ ఉన్న పోలీస్ ఆఫీసర్‌గా ట్రైలర్‌లో మాస్ అవతార్‌లో కనిపించి ‘షూర్ షాట్.. నో డౌట్.. సినిమా బ్లాక్ బస్టర్’ అనిపించేశాడు. సంక్రాంతి కానుకగా జనవరి 14న రిలీజ్ అవుతున్న సినిమాలో శ్రుతి హాసన్ హీరోయిన్ కాగా.. వరలక్ష్మీ శరత్ కుమార్ కీలక పాత్రలో నటిస్తోంది. సరస్వతి ఫిల్మ్స్ డివిజన్‌ నిర్మించిన మూవీలో చిరాగ్ జానీ, సముద్రఖని, రవి శంకర్ మెయిన్ విలన్స్‌గా కనిపించారు. విక్టరీ వెంకటేశ్ బ్యాక్ గ్రౌండ్ వాయిస్‌తో వస్తున్న సినిమాకు ఎస్.ఎస్.థమన్ మ్యూజిక్ అందించారు.

Tags:    

Similar News