జీహెచ్ఎంసీ అధికారులపై కిషన్ రెడ్డి ఫైర్

దిశ, వెబ్‎డెస్క్ : జీహెచ్ఎంసీ అధికారులపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ నగరంలో వరద బాధితులను కేంద్రమంత్రిగా పరామర్శించేందుకు వచ్చిన సమయంలో సంబంధిత అధికారులు ఎవరూ రాకపోవడంతో సీరియస్ అయ్యారు. గురువారం ఉదయం హిమాయత్ నగర్, ఖైరతాబాద్, బేగంపేట, బన్సీలాల్ పేట, రాంగోపాల్ పేట కిషన్ రెడ్డి పర్యటించారు. నగరంలో నాలాలపై పడ్డ చెట్లు, చెత్తను తొలగించకపోవడంతో అధికారులపై మండిపడ్డారు. కేంద్రమంత్రి స్థాయిలో పర్యటిస్తుంటే జీహెచ్ఎంసీ అధికారులు కనీసం ప్రోటోకాల్ పాటించలేదని, అధికారులు […]

Update: 2020-10-15 01:13 GMT

దిశ, వెబ్‎డెస్క్ : జీహెచ్ఎంసీ అధికారులపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ నగరంలో వరద బాధితులను కేంద్రమంత్రిగా పరామర్శించేందుకు వచ్చిన సమయంలో సంబంధిత అధికారులు ఎవరూ రాకపోవడంతో సీరియస్ అయ్యారు.

గురువారం ఉదయం హిమాయత్ నగర్, ఖైరతాబాద్, బేగంపేట, బన్సీలాల్ పేట, రాంగోపాల్ పేట కిషన్ రెడ్డి పర్యటించారు. నగరంలో నాలాలపై పడ్డ చెట్లు, చెత్తను తొలగించకపోవడంతో అధికారులపై మండిపడ్డారు. కేంద్రమంత్రి స్థాయిలో పర్యటిస్తుంటే జీహెచ్ఎంసీ అధికారులు కనీసం ప్రోటోకాల్ పాటించలేదని, అధికారులు తన వెంటరాలేదని అసహనం వ్యక్తం చేశారు.

Tags:    

Similar News