మూర్ఖుల్లారా.. సోనూ సూద్ ఫ్యాన్స్‌పై కవిత ఫైర్: Kavita Kaushik

దిశ, సినిమా: రియల్ హీరో సోనూ సూద్ చేస్తున్న సేవలకు గాను ఏపీలోని చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో ఆయన ఫొటోకు పాలాభిషేకం చేశారు అభిమానులు. తనను ఆదర్శంగా తీసుకుని సహాయ కార్యక్రమాలతో ముందుకు సాగితే కరోనా మరణాలే ఉండవని పిలుపునిచ్చారు. అయితే సోను ఫ్యాన్స్ చేసిన పనిపై ఫైర్ అయింది యాక్ట్రెస్ కవిత కౌశిక్. సోను నిస్వార్థంగా చేస్తున్న సేవలకు దేశం మొత్తం రుణపడి ఉంటుంది కానీ ప్రజలు ఆకలితో చనిపోతున్న సమయాల్లో అభిషేకమంటూ ఇలా పాలు […]

Update: 2021-05-21 03:45 GMT

దిశ, సినిమా: రియల్ హీరో సోనూ సూద్ చేస్తున్న సేవలకు గాను ఏపీలోని చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో ఆయన ఫొటోకు పాలాభిషేకం చేశారు అభిమానులు. తనను ఆదర్శంగా తీసుకుని సహాయ కార్యక్రమాలతో ముందుకు సాగితే కరోనా మరణాలే ఉండవని పిలుపునిచ్చారు. అయితే సోను ఫ్యాన్స్ చేసిన పనిపై ఫైర్ అయింది యాక్ట్రెస్ కవిత కౌశిక్. సోను నిస్వార్థంగా చేస్తున్న సేవలకు దేశం మొత్తం రుణపడి ఉంటుంది కానీ ప్రజలు ఆకలితో చనిపోతున్న సమయాల్లో అభిషేకమంటూ ఇలా పాలు వృథా చేయడం మూర్ఖత్వం అవుతుందని అభిప్రాయపడింది. ఈ పనిని సోను కూడా యాక్సెప్ట్ చేయడన్న కవిత పాండెమిక్ టైమ్‌లో ఇలాంటి పనులు మానుకుంటే మంచిదని సూచించింది. కొంతమంది నెటిజన్లు కూడా మిల్క్ వేస్ట్ చేయకూడదని అభిమానులకు సూచించాలని సోనూను కోరారు. అనాథ ఆశ్రమానికి లేదా అనాథ పిల్లలకు పాలు దానం చేస్తే బాగుంటుందన్నారు.

Tags:    

Similar News