బిగ్ బ్రేకింగ్: కత్తి మహేష్ కన్నుమూత

దిశ, వెబ్‌డెస్క్: సినీనటుడు, విశ్లేషకుడు కత్తి మహేశ్ కన్నుమూశారు. రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాల పాలైన ఆయన చెన్నై అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే శనివారం పరిస్థితి విషమించడంతో మరణించారు. ఊపిరితిత్తుల్లో సమస్య తలెత్తడంతోనే మరణించినట్లు అపోలో ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. కత్తి మహేశ్ మృతితో ఆయన అభిమానులు, బంధువులు కన్నీరు మున్నీరవుతున్నారు. జూన్ 26న నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం చంద్రశేఖరపురం వద్ద జాతీయ రహదారిపై కత్తి మహేశ్ ప్రయాణిస్తున్న కారు యాక్సిడెంట్‌కు గురైంది. […]

Update: 2021-07-10 06:39 GMT

దిశ, వెబ్‌డెస్క్: సినీనటుడు, విశ్లేషకుడు కత్తి మహేశ్ కన్నుమూశారు. రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాల పాలైన ఆయన చెన్నై అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే శనివారం పరిస్థితి విషమించడంతో మరణించారు. ఊపిరితిత్తుల్లో సమస్య తలెత్తడంతోనే మరణించినట్లు అపోలో ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. కత్తి మహేశ్ మృతితో ఆయన అభిమానులు, బంధువులు కన్నీరు మున్నీరవుతున్నారు. జూన్ 26న నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం చంద్రశేఖరపురం వద్ద జాతీయ రహదారిపై కత్తి మహేశ్ ప్రయాణిస్తున్న కారు యాక్సిడెంట్‌కు గురైంది. ఈ ప్రమాదంలో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. సీటు బెల్టు పెట్టుకోకపోవడంతో అతడి తల, ముక్కు, కళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. కారు నుజ్జునుజ్జయ్యింది. వెంటనే కత్తి మహేష్‌ను నెల్లూరులోని మెడికవర్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం అక్కడ నుంచి చెన్నై అపోలోకి తరలించారు. డాక్టర్లు తల, కంటి భాగాల్లో గాయాలవడంతో శస్త్రచికిత్స కూడా చేశారు.

సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి రూ.17 లక్షలు ఆర్థిక సాయం

కత్తి మహేష్‌ చికిత్స నిమిత్తం ఏపీ ప్రభుత్వం భారీ ఆర్థికసాయం ప్రకటించింది. సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి రూ. 17 లక్షలు ఆర్థిక సాయం విడుదల వేసింది. దీనిపై పెద్ద ఎత్తున దుమారం చెలరేగింది. సోషల్ మీడియా వేదికగా పలువురు జగన్ ప్రభుత్వాన్ని విమర్శించారు. కత్తి మహేశ్ వైసీపీ సానుభూతి పరుడు కావడంతోనే నిధులు విడుదల చేశారని ధ్వజమెత్తారు. ఇకపోతే రెండు వారాలుగా కత్తి మహేశ్‌కు వైద్యనిపుణులు చికిత్స అందించారు. అతని బంధువులు, స్నేహితులు కోలుకున్నట్లు కూడా తెలిపారు. త్వరలోనే ప్రజల మధ్యకు వస్తాడని తెలిపారు. ఇంతలోనే ఆయన మరణించారు.

Read more : ఫ్లాష్.. ఫ్లాష్.. మళ్లీ నోరు జారిన మంత్రి గంగుల కమలాకర్

Tags:    

Similar News