ఐదు రెట్లు పెరిగిన జూబిలెంట్ ఫుడ్‌వర్క్స్ లాభాలు

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ అతిపెద్ద ఫుడ్‌ సర్వీస్‌ కంపెనీ జూబిలెంట్‌ ఫుడ్‌వర్క్స్‌ 2020-21 ఆర్థిక సంవత్సరం మార్చితో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ నికర లాభాలు దాదాపు ఐదు రెట్లు పెరిగి రూ. 104.3 కోట్లకు చేరుకుందని ప్రకటించింది. సమీక్షించిన త్రైమాసికంలో కార్యకలాపాల ఆదాయం 14.3 శాతం పెరిగి రూ. 1,025.9 కోట్లకు చేరుకుందని, వడ్డీ, పన్ను, తరుగుదలకు ముందు కంపెనీ ఆదాయం 47 శాతం పెరిగి రూ. 249.2 కోట్లకు చేరుకుందని కంపెనీ తెలిపింది. పూర్తి ఆర్థిక […]

Update: 2021-06-15 10:48 GMT

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ అతిపెద్ద ఫుడ్‌ సర్వీస్‌ కంపెనీ జూబిలెంట్‌ ఫుడ్‌వర్క్స్‌ 2020-21 ఆర్థిక సంవత్సరం మార్చితో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ నికర లాభాలు దాదాపు ఐదు రెట్లు పెరిగి రూ. 104.3 కోట్లకు చేరుకుందని ప్రకటించింది. సమీక్షించిన త్రైమాసికంలో కార్యకలాపాల ఆదాయం 14.3 శాతం పెరిగి రూ. 1,025.9 కోట్లకు చేరుకుందని, వడ్డీ, పన్ను, తరుగుదలకు ముందు కంపెనీ ఆదాయం 47 శాతం పెరిగి రూ. 249.2 కోట్లకు చేరుకుందని కంపెనీ తెలిపింది. పూర్తి ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కంపెనీ నికర లాభాలు 15.2 శాతం క్షీణించి రూ. 233.7 కోట్లుగా వెల్లడించింది. అలాగే, కార్యకలాపాల ఆదాయం 15.9 శాతం తగ్గి రూ. 3,268.9 కోట్లకు చేరుకుందని కంపెనీ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది.

కాగా, జూబిలెంట్ ఫుడ్‌వర్క్స్ గత ఆర్థిక సంవత్సరంలో దేశీయంగా డొమినోస్ పిజ్జాకు సంబంధించిన 134 రెస్టారెంట్లను ప్రారంభించగా, 104 రెస్టారెంట్లను మూసేసింది. ప్రస్తుతం మొత్తం 293 నగరాల్లో 1,360 రెస్టారెంట్లను కొనసాగిస్తోంది. డంకింగ్ డోనట్స్‌కు సంబంధించి 24 రెస్టారెంట్లను నిర్వహిస్తోంది. ‘మార్చితో ముగిసిన త్రైమాసికంలో మెరుగైన వృద్ధిని సాధించాం. ఎక్కువ సంఖ్యలో కొత్త స్టోర్లను ప్రారంభించాము. బ్రాండ్ పోర్ట్‌ఫోలియోను కూడా విస్తరించామని, డిజిటల్, సరఫరా, ఇన్నోవేషన్ సహా ఇతర విభాగాల్లో పెట్టుబడులు కొనసాగిస్తున్నట్టు’ జూబిలెంట్ ఫుడ్‌వర్క్స్ సీఈఓ ప్రతీక్ చెప్పారు.

Tags:    

Similar News