గూగుల్ సంస్థలో భారీగా లేఆఫ్స్.. పైథాన్, డార్ట్, ఫ్లట్టర్ దాదాపు ఖాళీ!

ప్రపంచ దిగ్గజ టెక్ సంస్థ గూగుల్‌‌ గత కొన్ని వారాలుగా ఉద్యోగులకు షాక్ ఇస్తూనే ఉంది. సంస్థలో లేఆఫ్స్ ప్రక్రియ కొనసాగుతూనే ఉన్నాయి.

Update: 2024-04-30 09:46 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రపంచ దిగ్గజ టెక్ సంస్థ గూగుల్‌‌ గత కొన్ని వారాలుగా ఉద్యోగులకు షాక్ ఇస్తూనే ఉంది. సంస్థలో లేఆఫ్స్ ప్రక్రియ కొనసాగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా పలు విభాగాల్లో లేఆఫ్స్ ప్రకటించి ఉద్యోగులకు యాజమాన్యం షాక్ ఇచ్చింది. పైథాన్, డార్ట్, ఫ్లట్టర్ డిపార్టుమెంట్‌ని దాదాపు ఖాళీ చేసింది. ఆయా విభాగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులందరికీ పింక్ స్లిప్పులు ఇచ్చినట్లు సమాచారం. ఎంత మందిని తొలిగించారనేది సంస్థ ధృవీకరించలేదు.

ఖర్చులు తగ్గించాలని, పని వాతావరణాన్ని మరింత సమర్ధవంతంగా మార్చేందుకు గూగుల్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. దీంతో ఉద్యోగుల తొలగింపు పై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. కాగా, గూగుల్ తన ఇంజనీరింగ్, హార్డ్​వేర్​, అసిస్టెంట్ బృందాలతో సహా అనేక బృందాల్లో వందలాది ఉద్యోగులను ఈ ఏడాది జనవరిలో తొలగించింది. గూగుల్​ లేఆఫ్స్​పై ఉద్యోగులు.. సోషల్​ మీడియాలో తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగం పోయినట్టు.. చివరి నిమిషం వరకు తమ మేనేజర్​కి కూడా తెలియదని కామెంట్ చేస్తున్నారు.

Tags:    

Similar News