అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేయడం దారుణం

దిశ, వెబ్ డెస్క్: టీడీపీ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి, ఆయన కుమారుడు అస్మిత్‌రెడ్డిని విడుదలైన 24 గంటల్లోపే మరోసారి పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ అంశంపై జేసీ పవన్ రెడ్డి స్పందించారు. బెయిల్ పై విడుదలైన వారిపై మళ్లీ అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేయడం దారుణమన్నారు. జేసీ ప్రభాకర్ రెడ్డి ఎవరినీ కులం పేరుతో దూషించలేదని అన్నారు. ఆరోగ్యం బాగోలేదని త్వరగా పంపించాలని సీఐ దేవేంద్రను ప్రభాకర్ అడగారని పవన్ పేర్కొన్నారు. రెండోసారి అరెస్ట్ […]

Update: 2020-08-07 12:12 GMT

దిశ, వెబ్ డెస్క్: టీడీపీ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి, ఆయన కుమారుడు అస్మిత్‌రెడ్డిని విడుదలైన 24 గంటల్లోపే మరోసారి పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ అంశంపై జేసీ పవన్ రెడ్డి స్పందించారు. బెయిల్ పై విడుదలైన వారిపై మళ్లీ అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేయడం దారుణమన్నారు. జేసీ ప్రభాకర్ రెడ్డి ఎవరినీ కులం పేరుతో దూషించలేదని అన్నారు. ఆరోగ్యం బాగోలేదని త్వరగా పంపించాలని సీఐ దేవేంద్రను ప్రభాకర్ అడగారని పవన్ పేర్కొన్నారు. రెండోసారి అరెస్ట్ చేసిన జేసీకి ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. అక్కడి నుంచి గుత్తి మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. మరో 14 రోజుల పాటు రిమాండ్‌కు విధించటంతో మరోసారి కడప జిల్లా సబ్ జైలుకు తరలించారు.

Tags:    

Similar News