ఇళ్లలోనే ప్రార్థనలు

దిశ, మహబూబ్ నగర్: ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో సోమవారం ముస్లిం సోదరులు రంజాన్ పవిత్ర ప్రత్యేక ప్రార్థనలు ఇళ్లలోనే జరుపుకున్నారు. కొవిడ్-19 నిబంధనల ఆదేశాల మేరకు ముస్లింలు ఇళ్లలోనే ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్నారు. జిల్లాలోని ఈద్గాలు, మసీదుల వద్ద పోలీసు శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా పీకేటింగ్ లు నిర్వహించారు. జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు, ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు, వివిధ పార్టీలకు చెందిన నాయకులు, స్వచ్ఛంద సంస్థల నాయకులు, అధికారులు, అనధికారులు ముస్లింలకు రంజాన్ పండుగ […]

Update: 2020-05-24 23:44 GMT

దిశ, మహబూబ్ నగర్: ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో సోమవారం ముస్లిం సోదరులు రంజాన్ పవిత్ర ప్రత్యేక ప్రార్థనలు ఇళ్లలోనే జరుపుకున్నారు. కొవిడ్-19 నిబంధనల ఆదేశాల మేరకు ముస్లింలు ఇళ్లలోనే ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్నారు. జిల్లాలోని ఈద్గాలు, మసీదుల వద్ద పోలీసు శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా పీకేటింగ్ లు నిర్వహించారు. జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు, ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు, వివిధ పార్టీలకు చెందిన నాయకులు, స్వచ్ఛంద సంస్థల నాయకులు, అధికారులు, అనధికారులు ముస్లింలకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్ పర్వదినం సందర్భంగా నెల రోజుల పాటు ఉపవాస దీక్షలు చేపట్టి ఇళ్లలోనే నిబద్ధతతో రంజాన్ మాసాన్ని గడిపి కొవిడ్-19 నిబంధనలను పాటించిన జిల్లా ముస్లింలకు ముస్లిం మత పెద్దలు, అధికారులు, పోలీస్ శాఖ అధికారులు ప్రత్యేకంగా ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.

Tags:    

Similar News