ఐపీఎల్ 2024: టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్

ఐపీఎల్ 2024 లో భాగంగా ఈ రోజు 47వ మ్యాచ్ ఢిల్లీ క్యాపిటల్స్, కలకత్తా నైట్ రైడర్స్ జట్ల మధ్య జరుగుతుంది.

Update: 2024-04-29 13:35 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ 2024 లో భాగంగా ఈ రోజు 47వ మ్యాచ్ ఢిల్లీ క్యాపిటల్స్, కలకత్తా నైట్ రైడర్స్ జట్ల మధ్య జరుగుతుంది. కలకత్తాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో కేకేఆర్ జట్టు మొదట బౌలింగ్ చేయనుంది. ఈ సీజన్ లో మొదట కాస్త ఓడిదుడుకులు ఎదుర్కోన్న ఢిల్లీ.. వరుస విజయాలతో ప్లే ఆఫ్ రేసులో కొనసాగుతోంది. అలాగే కేకేఆర్ ఒక గెలుపు ఒక ఓటమితో పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతోంది. కాగా ఈ మ్యాచ్ లో గెలిచిన జట్టు రెండో స్థానంలో కొనసాగునుండగా.. కేకేఆర్ జట్టుపై గెలిచి హ్యాట్రిక్ విజయం అందుకొవాలిన ఢిల్లీ భావిస్తుంది. అలాగే గత మ్యాచుల్లో 261 లను కాపాడుకోలేక ఓడిపోయిన కేకేఆర్ జట్టు ఈ మ్యాచులో ఎలాగైన గెలవాలని చూస్తుంది. మరీ ఈ మ్యాచ్ లో ఎవరు గెలిచి పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలుస్తారో తెలియాలంటే మ్యాచ్ చివరి వరకు వేచి చూడాల్సిందే మరి.

కోల్‌కతా నైట్ రైడర్స్ (ప్లేయింగ్ XI): ఫిలిప్ సాల్ట్ (w), సునీల్ నరైన్, వెంకటేష్ అయ్యర్, శ్రేయాస్ అయ్యర్ (సి), ఆండ్రీ రస్సెల్, రింకూ సింగ్, రమణదీప్ సింగ్, మిచెల్ స్టార్క్, వైభవ్ అరోరా, హర్షిత్ రాణా, వరుణ్ చకరవర్తి

ఢిల్లీ క్యాపిటల్స్ (ప్లేయింగ్ XI): పృథ్వీ షా, జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్, అభిషేక్ పోరెల్, షాయ్ హోప్, రిషబ్ పంత్(w/c), ట్రిస్టన్ స్టబ్స్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, రసిఖ్ దార్ సలామ్, లిజాద్ విలియమ్స్, ఖలీల్ అహ్మద్

Similar News