కాసేపట్లో SRH Vs GT కీలక మ్యాచ్.. వర్షంతో ఫ్యాన్స్‌లో హై టెన్షన్!
ఉప్పల్ పరిసరాల్లో ఈదురుగాలులు వీయడంతో పాటు చిరు జల్లులు కురుస్తున్నాయి.
దిశ, వెబ్‌డెస్క్: ఉప్పల్ పరిసరాల్లో ఈదురుగాలులు వీయడంతో పాటు చిరు జల్లులు కురుస్తున్నాయి. దీంతో గ్రౌండ్ స్టాఫ్ ముందు జాగ్రత్తగా పిచ్ పై కవర్లు కప్పి ఉంచారు. ఇవాళ రాత్రి 7 గంటలకు హైదరాబాద్ - గుజరాత్ మధ్య కీలక మ్యాచ్ ఉంది. ప్లేఆఫ్ చేరుకోవాలంటే సన్ రైజర్స్ ఈ మ్యాచ్‌లో తప్పక గెలవాల్సి ఉంది. కీలకమైన మ్యాచ్ వేళ వర్షంతో అభిమానుల్లో హై టెన్షన్ నెలకొంది. అయితే సన్ రైజర్స్ కు ఈ మ్యాచ్ తప్పకగెలవాల్సిన మ్యాచ్ కాగా.. 14 పాయింట్లతో ఉన్న సన్ రైజర్స్ గెలవడం ద్వారా 16 పాయింట్లతో నేరుగా ప్లేఆఫ్ చేరుకోనుంది.