మెప్పించిన ఇన్ఫోసిస్, మిశ్రమంగా విప్రో త్రైమాసిక ఫలితాలు!

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ టెక్ దిగ్గజ సంస్థలు ఇన్ఫోసిస్, విప్రో బుధవారం సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసిక ఫలితాలను వెల్లడించాయి. ఇన్ఫోసిస్ కంపెనీ అంచనాలను అధిగమిస్తూ సమీక్షించిన త్రైమాసికంలో 12 శాతం వృద్ధితో రూ. 5,421 కోట్ల నికర లాభాలను ప్రకటించింది. త్రైమాసిక పరంగా ఇది 4.4 శాతం వృద్ధి సాధించినట్టు కంపెనీ తెలిపింది. ఇక, కార్యకలాపాల ఆదాయం సైతం 20.5 శాతం పెరిగి రూ. 29,602 కోట్లకు చేరుకుంది. అలాగే, కంపెనీ షేర్‌హోల్డర్లకు ఒక్కో షేర్‌కు రూ. […]

Update: 2021-10-13 07:02 GMT

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ టెక్ దిగ్గజ సంస్థలు ఇన్ఫోసిస్, విప్రో బుధవారం సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసిక ఫలితాలను వెల్లడించాయి. ఇన్ఫోసిస్ కంపెనీ అంచనాలను అధిగమిస్తూ సమీక్షించిన త్రైమాసికంలో 12 శాతం వృద్ధితో రూ. 5,421 కోట్ల నికర లాభాలను ప్రకటించింది. త్రైమాసిక పరంగా ఇది 4.4 శాతం వృద్ధి సాధించినట్టు కంపెనీ తెలిపింది. ఇక, కార్యకలాపాల ఆదాయం సైతం 20.5 శాతం పెరిగి రూ. 29,602 కోట్లకు చేరుకుంది. అలాగే, కంపెనీ షేర్‌హోల్డర్లకు ఒక్కో షేర్‌కు రూ. 15 డివిడెండ్‌ను అందించేందుకు నిర్ణయించినట్టు కంపెనీ పేర్కొంది. దైంలర్ కంపెనీతో జరిగిన ఒప్పందం కారణంగానే రెండో త్రైమాసికంలో మెరుగైన ఫలితాలను సాధించామని కంపెనీ ఓ ప్రకటనలో వెల్లడించింది.

మరో ఐటీ దిగ్గజ సంస్థ విప్రో ఇదే త్రైమాసికంలో మిశ్రమ ఫలితాలను ప్రకటించింది. జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో కంపెనీ రూ. 2,930 కోట్లతో త్రైమాసిక పరంగా 9 శాతం క్షీణతను నమోదు చేసింది. వేతనాల పెంపు, మార్జిన్లు తగ్గడం, క్యాప్‌కో కంపెనీ కొనుగోలు వల్ల ఫలితాలు ఆశించిన స్థాయిలో లేవని సంస్థ అభిప్రాయపడింది. అయితే, వార్షిక ప్రాతిపదికన సంస్థ లాభాలు 17 శాతం పెరిగాయని స్పష్టం చేసింది. సమీక్షించిన త్రైమాసికంలో ఆదాయం 30 శాతం వృద్ధితో రూ. 19,667 కోట్లను ప్రకటించింది. త్రైమాసిక ఫలితాల వెల్లడి నేపథ్యంలో బుధవారం ట్రేడింగ్‌లో ఇన్ఫోసిస్ షేర్ 1.1 శాతం పెరిగి రూ. 1,705 వద్ద, విప్రో షేర్ 2 శాతం పెరిగి రూ. 672.4 వద్ద ర్యాలీ చేశాయి.

Tags:    

Similar News