ఇందిరా హాయంలోనే పౌర హక్కులను హరించారు.. కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీ

Indira Gandhi government curbed civil liberties: Hardeep Singh Puri slams Rahul Gandhi over UK remarks

Update: 2023-03-20 10:36 GMT

న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ లండన్ వ్యాఖ్యలపై కౌంటర్ ఎటాక్ చేశారు. ఇందిరా గాంధీ హయాంలో పౌర హక్కులు హరించారనే విషయాన్ని కాంగ్రెస్ గుర్తు చేసుకోవాలని ప్రతిదాడికి దిగారు. సోమవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. భారత అంతరంగ విషయాల్లో విదేశీ శక్తులను జోక్యం చేసుకోమన్న రాహుల్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. చైనా బెల్ట్ రోడ్ ఇనిషియేటివ్ విజనరీని రాహుల్ ప్రశంసించారని.. ఈ నిర్మాణం పాక్ అక్రమిత కశ్మీర్ గుండా వెళ్తుందని ఆయనకు తెలుసా అని ప్రశ్నించారు.

‘ఏ వ్యక్తి అయినా దేశం వెలుపలికి వెళితే అతనికి మాట్లాడే స్వేచ్ఛ ఉంది, కానీ బాధ్యతాయుతంగా ఉండాల్సిన అవసరం ఉందని నేను భావిస్తున్నాను. మనది ప్రపంచంలోనే అత్యంత పురాతన ప్రజాస్వామ్యం’ అని అన్నారు. రాహుల్ నానమ్మ ఎన్నికైన ప్రభుత్వాన్ని రద్దు చేసినట్లు విమర్శించారు. కాగా, తాజాగా రాహుల్ లండన్ పర్యటనలో ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. భారతదేశంలో ప్రజాస్వామ్యంపై దాడి జరుగుతుందని అన్నారు.


Tags:    

Similar News