2021 సంవత్సరపు చెత్త కంపెనీగా FaceBook

దిశ, వెబ్‌డెస్క్: ఇటీవల యాహు నిర్వహించిన సర్వేలో 2021 సంవత్సరపు చెత్త కంపెనీగా ఫేస్‌బుక్ నిలిచింది. డిసెంబర్ 4, 5 తేదీల్లో ఓపెన్-ఎండ్ సర్వే నిర్వహించారు. ఏడాది పొడవునా వివాదాల్లో చిక్కుకున్న ఫేస్‌బుక్ ఇటీవలే మెటాగా పేరు మార్చుకుంది. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ లాభదాయకత కోసం వినియోగదారుల భద్రతను విస్మరించిందని ఆరోపణలు వచ్చాయి. తప్పుడు సమాచారాన్ని నియంత్రించ లేకపోయిందని ఫిర్యాదులు అందాయి. పిల్లలు, యుక్త వయస్కులు మానసిక ఆరోగ్యంపై దాని ఫొటో-షేరింగ్ సైట్ Instagram ప్రభావం గురించి […]

Update: 2021-12-21 11:10 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఇటీవల యాహు నిర్వహించిన సర్వేలో 2021 సంవత్సరపు చెత్త కంపెనీగా ఫేస్‌బుక్ నిలిచింది. డిసెంబర్ 4, 5 తేదీల్లో ఓపెన్-ఎండ్ సర్వే నిర్వహించారు. ఏడాది పొడవునా వివాదాల్లో చిక్కుకున్న ఫేస్‌బుక్ ఇటీవలే మెటాగా పేరు మార్చుకుంది. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ లాభదాయకత కోసం వినియోగదారుల భద్రతను విస్మరించిందని ఆరోపణలు వచ్చాయి. తప్పుడు సమాచారాన్ని నియంత్రించ లేకపోయిందని ఫిర్యాదులు అందాయి. పిల్లలు, యుక్త వయస్కులు మానసిక ఆరోగ్యంపై దాని ఫొటో-షేరింగ్ సైట్ Instagram ప్రభావం గురించి కొంతమంది కలత చెందారు. వీటి కారణంగా ఫేస్‌బుక్ మంచి అభిప్రాయాన్ని పొందలేకపోయింది. ఈ సర్వేలో రన్నరప్‌గా చైనీస్ ఈ-కామర్స్ కంపెనీ అలీబాబా నిలిచింది. మరోవైపు 2021 సంవత్సరానికి మైక్రోసాఫ్ట్‌ను కంపెనీ ఆఫ్ ది ఇయర్‌గా ఎంపిక చేసింది.

Tags:    

Similar News