నాగార్జున సాగర్‌కు భారీ వరద.. 589 అడుగులకు చేరిన నీటిమట్టం

దిశ, నల్గొండ:  నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతుంది. నాగార్జున సాగర్ జలాశయానికి నాలుగు రోజుల నుంచి వరద పోటెత్తుతోంది. దీంతో ప్రాజెక్ట్ లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. శుక్రవారం ఉదయం 10 క్రస్ట్ గేట్లను 5 ఫీట్ల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. సాగర్ ఇన్ ఫ్లో 2,16,137 క్యూసెక్కులు కాగా, అవుట్ ఫ్లో 1,33,137 క్యూసెక్కులుగా కొనసాగుతుంది. సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 590.00 అడుగులు ఉండగా, […]

Update: 2021-09-16 22:03 GMT

దిశ, నల్గొండ: నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతుంది. నాగార్జున సాగర్ జలాశయానికి నాలుగు రోజుల నుంచి వరద పోటెత్తుతోంది. దీంతో ప్రాజెక్ట్ లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. శుక్రవారం ఉదయం 10 క్రస్ట్ గేట్లను 5 ఫీట్ల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. సాగర్ ఇన్ ఫ్లో 2,16,137 క్యూసెక్కులు కాగా, అవుట్ ఫ్లో 1,33,137 క్యూసెక్కులుగా కొనసాగుతుంది. సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 590.00 అడుగులు ఉండగా, ప్రస్తుత నీటిమట్టం 589.70 అడుగులు ఉంది. సాగర్ పూర్తి సామర్థ్యం 312.0450 టీఎంసీలు కాగా, ప్రస్తుత నీటి నిల్వ 311.1486 టీఎంసీలుగా ఉంది.

 

Tags:    

Similar News