పచ్చి బొప్పాయిని తినడం వల్ల శరీరంలో వచ్చే మార్పులివే?

బొప్పాయి పండుతో గింజలతో ఎన్నో రకాల ప్రయోజనాలున్నాయని అందరికీ తెలిసిందే..

Update: 2023-03-16 10:49 GMT

దిశ, వెబ్ డెస్క్: బొప్పాయి పండుతో గింజలతో ఎన్నో రకాల ప్రయోజనాలున్నాయని అందరికీ తెలిసిందే. కానీ, పచ్చి బొప్పాయి కాయను ఇలా చేసుకొని తింటే అనారోగ్య సమస్యలు తలెత్తకుండా ఉంటుంది. బొప్పాయి కాయలో విటమిన్లు, కాల్షియం, జింక్, మెగ్నీషియం, పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్ వంటి పోషకాలు పుష్కలంగా ఉండి మంచి ఫలితాలను కలిగిస్తాయి.

బొప్పాయిని కూర చేసుకుని తింటే జీర్ణక్రియ మెరుగు పడటంతో పాటు గ్యాస్ట్రిక్ సమస్యలు రాకుండా ఉంటాయి. అంతేకాకుండా డెంగీ జ్వరంతో బాధపడేవారు పచ్చి బొప్పాయి జ్యూస్ తాగితే ప్లేట్ లెట్స్ సంఖ్య పెరుగుతుంది. ఇందులో ఉండే ప్రోటీన్ల వల్ల కొత్త కణాలు ఏర్పడతాయి. పచ్చి బొప్పాయి తింటే ప్రేగు కదలికల్లో మార్పులు వస్తాయి.

Tags:    

Similar News