ఈ రోజుల్లో అమ్మాయిలు చిన్న వయసులోనే పుష్పవతి అవుతున్నారు..దానికి రీజన్ ఏమై ఉంటుంది?

ప్రస్తుతం ఆడపిల్లలు చిన్నవయసులోనే రజస్వల అవుతున్నారు. ఒకప్పటికి ఇప్పటికి చాలా మారిపోయింది. గతంలో ఒక అమ్మాయికి 14 నుంచి 16 మధ్యలో మొదటి పీరియడ్ అనేది వచ్చేది కానీ ప్రస్తుతం తొమ్మిది సంవత్సరాలు

Update: 2024-05-08 09:49 GMT

దిశ, ఫీచర్స్ : ప్రస్తుతం ఆడపిల్లలు చిన్నవయసులోనే రజస్వల అవుతున్నారు. ఒకప్పటికి ఇప్పటికి చాలా మారిపోయింది. గతంలో ఒక అమ్మాయికి 14 నుంచి 16 మధ్యలో మొదటి పీరియడ్ అనేది వచ్చేది కానీ ప్రస్తుతం తొమ్మిది సంవత్సరాలు నిండకముందే మెన్సెస్ వస్తున్నాయి. దీంతో చిన్నారుల తల్లిదండ్రులు ఆందోళనకు గురి అవుతున్నారు. ఇంత చిన్న వయసులో ఎందుకు ఈ సమస్య వస్తుందని ఆందోళనకు గురి అవుతున్నారు. ఆడపిల్లలు రజస్వల అయ్యిందంటే ఆమె కౌమారం నుంచి యవ్వనంలోకి అడుగు పెట్టిందనే అర్థం. చిన్న పిల్లగా ఉన్న అమ్మాయి సంతానోత్పత్తికి తగ్గట్టు ఎదిగిందని భావిస్తారు. అయితే ఇప్పుడు ఎనిమిది, తొమ్మిది సంవత్సరాల్లోనే ఈ పరిస్థితి రావడంతో.. ఏమి తెలియని వయసులో తన కూతురు శరీరంలోని మార్పులను, చిన్న ఏజ్ నుంచే పీరియడ్స్ సమస్యను ఎలా ఎదుర్కొంటుందో అని భయపడుతున్నారు పేరెంట్స్. అయితే దీనికి గల అసలు కారణం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

1. దీర్ఘకాలిక వ్యాధులు : ఏమైనా అనారోగ్య సమస్యలతో సతమతం అవుతున్నవారు. త్వరగా రజస్వల అవుతారు అంటున్నారు నిపుణులు.

2. నిద్రలేమి : కంటినిండా నిద్ర పోని అమ్మాయిల్లో హార్మోన్‌లలో మార్పులు వస్తాయంట. దీని కారణంగా వారు త్వరగా రజస్వల అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది.

3. అధిక బరువు : అధిక బరువు వలన కూడా చాలా మంది త్వరగా పీరియడ్స్ సమస్య బారిన పడతారు. శరీరంలోని అధిక కొవ్వు ఈస్ట్రోజెన్ హార్మోన్ ఉత్పత్తి పెంచుతుంది, ఇది పిల్లలో త్వరగా నెలసరి మొదలవ్వడానికి కారణం అవుతుంది.

4. ఒత్తిడి : అధిక ఒత్తిడి, టెన్షన్ కూడా హార్మోన్స్ పై ప్రభావం చూపిస్తుంది. దాని వలన వారిలో త్వరగా నెలసరి వస్తుంటుంది.

5. జీవన శైలి : మనం తీసుకునే ఆహారం, జీవనశైలి కారణంగా కూడా చిన్న పిల్లలు త్వరగా పుష్పవతి అవ్వడానికి కారణం అవుతోందంట.

6. వ్యాయామం లేకపోవడం : శారీరక శ్రమ అనేది లేకపోవడం వలన కూడా పిల్లల్లో నెలసరి త్వరగా వస్తుందంట.

Similar News