రాత్రి సమయంలో ఈ పండ్లు తింటే.. ఆ సమస్యలు తప్పవంట!

Update: 2023-02-15 06:59 GMT

దిశ, వెబ్‌డెస్క్ : చాలా మంది పండ్లను ఎక్కువ ఇష్టంగా తింటుంటారు. ఇక ఏదైనా అనారోగ్య సమస్య వస్తే చాలు అందరికీ ముందుగా గుర్తు వచ్చేవి ఫ్రూట్సే. అయితే పండ్లను తింటే ఆరోగ్యమే కాదండి, అనారోగ్య సమస్యలు కూడా వస్తాయంట. అది ఎలా అనుకుంటున్నారా? పండ్లు ఒక ప్రత్యేక సమయంలో మాత్రమే తీసుకోవాలంట. రాత్రి వేళ కొన్ని పండ్లు అస్సలే తినకూడదంట. అవి ఏమిటంటే?

యాపిల్ పండును రాత్రి పూట అస్సలే తినకూడదంట. ఇందులో అక్జాలిక్ యాసిడ్ ఉండటం వలన ఎసిడిటీ లాంటి సమస్యలు ఏర్పడే అవకాశం ఉన్నదంట.

అరటి పండును రాత్రి 10 దాటిన తర్వాత అస్సలే తినకూడదంట. ఎందుకంటే, పడుకునే ముందు అరటి పండు తినడం వలన అది భోజనం అరగకుండా చేస్తుంది. దీని వలన గ్యాస్ట్రిక్ సమస్యలు ఏర్పడుతాయి.

సపోట పడును రాత్రి పూట తినకూడదంటున్నారు ఆరోగ్య నిఫుణులు. సపోటలో అధికంగా చక్కర శాతం ఉండటం వలన అది రక్తంలో కలిసే అవకాశం ఉంది. అందువలన సపోటను రాత్రి సమయంలో తినకూడదంట.

Tags:    

Similar News