బుల్లెట్లు, లాఠీ దెబ్బలను ఎదుర్కొని రైతులు విజయం సాధించారు : హరీష్ రావు

దిశ, తెలంగాణ బ్యూరో : రాత్రింబవళ్లు రోడ్లపై నిలిచి నిరసనలతో కేంద్రానికి రైతు శక్తిని పోరాటాన్ని చూపారని మంత్రి హరీష్ రావు అన్నారు. కేంద్రం రైతు చట్టాలను వెనక్కి తీసుకున్నట్లు చేసిన ప్రకటనపై శుక్రవారం ట్విట్టర్ వేదికగా స్వాగతించారు. వ్యవసాయ చట్టాల రద్దు రైతు విజయమని, ఇది దేశ ప్రజలందరి విజయమని అన్నారు. రైతు ఉద్యమంలో పట్టుదలతో పాల్గొన్న త్యాగశీలులందరికీ ఉద్యమ అభినందనలు తెలిపారు. రైతులను నట్టేట ముంచేలా కేంద్ర ప్రభుత్వం చేసిన నల్ల వ్యవసాయ చట్టాల […]

Update: 2021-11-19 01:36 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : రాత్రింబవళ్లు రోడ్లపై నిలిచి నిరసనలతో కేంద్రానికి రైతు శక్తిని పోరాటాన్ని చూపారని మంత్రి హరీష్ రావు అన్నారు. కేంద్రం రైతు చట్టాలను వెనక్కి తీసుకున్నట్లు చేసిన ప్రకటనపై శుక్రవారం ట్విట్టర్ వేదికగా స్వాగతించారు. వ్యవసాయ చట్టాల రద్దు రైతు విజయమని, ఇది దేశ ప్రజలందరి విజయమని అన్నారు. రైతు ఉద్యమంలో పట్టుదలతో పాల్గొన్న త్యాగశీలులందరికీ ఉద్యమ అభినందనలు తెలిపారు. రైతులను నట్టేట ముంచేలా కేంద్ర ప్రభుత్వం చేసిన నల్ల వ్యవసాయ చట్టాల రద్దు ప్రకటన దేశ రైతుల విజయమన్నారు. ఏడాదికాలంగా బుల్లెట్లకు, లాఠీలకు, వాటర్ కానన్‌లకు, పోలీసు కంచెలను, నిషేధాలను ఎదుర్కొని విజయం సాధించిన తీరు అద్భుతమని పేర్కొన్నారు.

https://twitter.com/trsharish/status/1461573697655902208?s=20

Tags:    

Similar News