హార్దిక్ పాండ్యా ఔట్.. టీమిండయాకు నయా ఆల్ రౌండర్

దిశ, వెబ్‌డెస్క్: టీ20 ప్రపంచకప్‌లో దారుణంగా విఫలమైనహార్దిక్ పాండ్యాపై BCCI వేటు వేసింది. సొంతగడ్డపై న్యూజిలాండ్‌తో జరుగనున్న మూడు టీ20ల సిరీస్‌కు 16 మంది సభ్యులతో కూడిన జట్టును BCCI మంగళవారం ప్రకటించింది. ఊహించినట్లుగానే రోహిత్ శర్మకు టీ20 కెప్టెన్ బాధ్యతలు అప్పగించి, ముగ్గురు కొత్త ప్లేయర్లకు జట్టులో అవకాశం కల్పించింది. IPLలో సత్తా చాటిన వెంకటేశ్ అయ్యర్‌‌తో పాటు టాప్ వికెట్ టేకర్‌గా నిలచిన హర్షల్ పటేల్, అవేశ్ ఖాన్‌‌ను ఎంపిక చేసింది. హార్దిక్ పాండ్యా […]

Update: 2021-11-10 12:03 GMT

దిశ, వెబ్‌డెస్క్: టీ20 ప్రపంచకప్‌లో దారుణంగా విఫలమైనహార్దిక్ పాండ్యాపై BCCI వేటు వేసింది. సొంతగడ్డపై న్యూజిలాండ్‌తో జరుగనున్న మూడు టీ20ల సిరీస్‌కు 16 మంది సభ్యులతో కూడిన జట్టును BCCI మంగళవారం ప్రకటించింది. ఊహించినట్లుగానే రోహిత్ శర్మకు టీ20 కెప్టెన్ బాధ్యతలు అప్పగించి, ముగ్గురు కొత్త ప్లేయర్లకు జట్టులో అవకాశం కల్పించింది. IPLలో సత్తా చాటిన వెంకటేశ్ అయ్యర్‌‌తో పాటు టాప్ వికెట్ టేకర్‌గా నిలచిన హర్షల్ పటేల్, అవేశ్ ఖాన్‌‌ను ఎంపిక చేసింది.

హార్దిక్ పాండ్యా ఫిట్‌గా లేకపోయినా టీ20 ప్రపంచకప్ వరకు అతనికి అండగా నిలిచిన BCCI సెలెక్షన్ కమిటీ మెగా టోర్నీలో ఘోర వైఫల్యం తరువాత అతనిపై వేటు వేసింది. ఫిట్‌నెస్ సమస్యతో బాధపడుతున్న పాండ్యాను కేవలం బ్యాటర్‌గా జట్టులో కొనసాగించడం అనవసరమని సెలెక్టర్ల భావించినట్లు తెలుస్తోంది. జట్టుకు ఆల్ రౌండర్ అవసరం ఉన్నందున పృథ్వీ షా, శుభ్‌మన్ గిల్‌లను కాదని వెంకటేశ్ అయ్యర్‌‌కు సెలెక్టర్లు అవకాశం కల్పించారు. ఓపెనర్ అయినటువంటి వెంకటేశ్ అయ్యర్‌ను మిడిలార్డర్ బ్యాట్స్‌మన్‌గా మార్చేందుకు కూడా సిద్దమైనట్లు తెలుస్తోంది. మొత్తానికి వెంకటేశ్ అయ్యర్‌తో హార్దిక్ పాండ్యాకు చెక్ పెట్టాలని సెలెక్టర్లు భావిస్తున్నట్లు స్పష్టమవుతోంది.

ఫైనల్‌కి దూసుకెళ్లిన కివీస్.. ఇంగ్లాండ్‌పై ఘన విజయం

Tags:    

Similar News