సెయిల్‌లో ప్రభుత్వ వాటా అమ్మకానికి రెడీ!

          కేంద్రం.. ప్రభుత్వ అధీనంలో ఉన్న ఆస్తులను అమ్మే ప్రక్రియను వేగవంతం చేసింది. బడ్జెట్ సమావేశాల్లో ఎల్ఐసీలోని 10 శాతం వాటాను అమ్మడానికి సిద్ధమైనట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్(సెయిల్)లో 5 శాతం వాటాను విక్రయించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ విక్రయం ద్వారా ప్రభుత్వ ఖజానాకు సుమారు రూ. 1000 కోట్లు చేరుతాయని ఓ అధికారి తెలిపారు. పెట్టుబడి, ప్రజా ఆస్తుల నిర్వహణ విభాగం(డీఐపీఏఎమ్), […]

Update: 2020-02-09 04:32 GMT

కేంద్రం.. ప్రభుత్వ అధీనంలో ఉన్న ఆస్తులను అమ్మే ప్రక్రియను వేగవంతం చేసింది. బడ్జెట్ సమావేశాల్లో ఎల్ఐసీలోని 10 శాతం వాటాను అమ్మడానికి సిద్ధమైనట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్(సెయిల్)లో 5 శాతం వాటాను విక్రయించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ విక్రయం ద్వారా ప్రభుత్వ ఖజానాకు సుమారు రూ. 1000 కోట్లు చేరుతాయని ఓ అధికారి తెలిపారు. పెట్టుబడి, ప్రజా ఆస్తుల నిర్వహణ విభాగం(డీఐపీఏఎమ్), ఉక్కు మంత్రిత్వ శాఖ తాజాగా సెయిల్ వాటా అమ్మకం కోసం సింగపూర్, హాంకాంగ్‌లలో రోడ్‌షోలను నిర్వహించేందుకు ప్రణాళిక రూపొందిస్తోంది.

ప్రస్తుతానికి కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా హాంకాంగ్‌లో రోడ్‌షో రద్దు అయింది. సెయిల్‌లో ప్రభుత్వానికి 75 శాతం వాటా ఉంది. చివరిసారిగా 2014,డిసెంబర్‌లో స్టీల్ సీపీఎస్ఈలో 5 శాతం వాటాను ప్రభుత్వం విక్రయించింది. ‘ప్రభుత్వం ఆఫర్ ఫర్ సేల్ ద్వారా 5 శాతం వాటాను అమ్మేందుకు సిద్ధమైంది. సింగపూర్‌లో జరిగే కార్యక్రమంలో పెట్టుబడిదారుల నుంచి డిమాండ్ ఉంటుందని భావిస్తున్నాము’ అని సంబంధిత అధికారి చెప్పారు. ప్రస్తుతం మార్కెట్ ధర అంచనా ప్రకారం సంస్థలో 5 శాతం వాటా అమ్మడం ద్వారా ప్రభుత్వం సుమారు రూ. 1000 కోట్లు సేకరించుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం స్టాక్ మార్కెట్లలో సెయిల్‌ షేర్ రూ. 48.50 వద్ద కొనసాగుతోంది.

సవరించిన అంచనాల ప్రకారం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోగా రూ. 65,000 కోట్ల పెట్టుబడుల లక్ష్యాన్ని సాధించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. దీనికి సంబంధించిన లావాదేవీలను ఈ ఆర్థిక సంవత్సరంలోనే పూర్తీ చేసేందుకే ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఇప్పటి వరకూ సీపీఎస్ఈ వాటా అమ్మకం నుండి రూ. 34,000 కోట్లను సేకరించింది. మిగిలిన రూ. 31,000 కోట్లను మార్చి చివరి నాటికి రాబాట్టాల్సి ఉంది. 2020-21 ఆర్థిక సంవత్సరానికి సీపీఎస్ఈ వాటా అమ్మకం నుంచి రూ. 1.20 లక్షల కోట్లను సాధించనున్నట్టు ప్రభుత్వం బడ్జెట్‌లో నిర్ణయించింది.

అలాగే, గార్డెన్ రీచ్ షిప్‌బిల్డర్స్, ఇంజనీర్స్ లిమిటెడ్(జీఆర్ఎస్ఈ)లోనూ 10 శాతం వాటాను విక్రయించే వైపుగా ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఈ సంస్థలో ప్రభుత్వానికి 74.50 శాతం వాటా ఉంది. ప్రస్తుత మార్కెట్ ధరల ఆధారంగా ఈ సంస్థలో వాటాను అమ్మడం ద్వారా ప్రభుత్వానికి రూ. 200 కోట్లు రానున్నాయి.

Tags:    

Similar News