ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారెంటీ పథకం దరఖాస్తు గడువు పొడిగింపు

దిశ, వెబ్‌డెస్క్: కరోనా మహమ్మారి వల్ల దెబ్బతిన్న వ్యాపారాలను ప్రోత్సహించేందుకు కేంద్రం తెచ్చిన ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారెంటీ పథకం(ఈసీఎల్‌జీఎస్) కోసం దరఖాస్తు చేసుకునేందుకు మూడు నెలలు పొడిగించింది. ఈ పథకం ద్వారా వ్యాపార రుణాల కోసం దరఖాస్తు చేసుకునేందుకు మార్చి 31 వరకు గడువు ఉంది. దీన్ని ఇప్పుడు జూన్ 30 వరకు పొడిగిస్తున్నట్టు ప్రభుత్వం స్పష్టం చేసింది. అదేవిధంగా ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారెంటీ పథకం 3.0ను తీసుకొచ్చింది. దీని ద్వారా ఇప్పటికే ఇస్తున్న […]

Update: 2021-04-02 06:59 GMT

దిశ, వెబ్‌డెస్క్: కరోనా మహమ్మారి వల్ల దెబ్బతిన్న వ్యాపారాలను ప్రోత్సహించేందుకు కేంద్రం తెచ్చిన ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారెంటీ పథకం(ఈసీఎల్‌జీఎస్) కోసం దరఖాస్తు చేసుకునేందుకు మూడు నెలలు పొడిగించింది. ఈ పథకం ద్వారా వ్యాపార రుణాల కోసం దరఖాస్తు చేసుకునేందుకు మార్చి 31 వరకు గడువు ఉంది. దీన్ని ఇప్పుడు జూన్ 30 వరకు పొడిగిస్తున్నట్టు ప్రభుత్వం స్పష్టం చేసింది. అదేవిధంగా ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారెంటీ పథకం 3.0ను తీసుకొచ్చింది. దీని ద్వారా ఇప్పటికే ఇస్తున్న రంగాలతో పాటు హాస్పిటాలిటీ, ట్రావెల్, టూరిజం రంగాల్లో వ్యాపారాలను నిర్వహిస్తున్న వారికీ ఈ పథకాన్ని అమలు చేస్తున్నట్టు వెల్లడించింది.

‘సేవల రంగాలైన హాస్పిటాలిటీ, ట్రావెల్, టూరిజంలలో వ్యాపార సంస్థలను ఈసీఎల్‌జీఎస్ 3.0లో కలుపుతూ ఈ పథకం పరిధిని విస్తరిస్తున్నామని’ ఆర్థికశాఖ ఓ ప్రకటనలో తెలిపింది. ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారెంటీ పథకం దరఖాస్తు గడువును ఈ ఏడాది జూన్ 30 వరకు పొడిగించామని, అర్హత గల వ్యాపారులు దరఖాస్తు చేసుకోవచ్చని మంత్రిత్వ శాఖ పేర్కొంది. కాగా, ఈ పథకం ద్వారా కేంద్రం రూ. 3 లక్షల కోట్ల రుణాలను అందించనుంది.

Tags:    

Similar News