టేస్టీ గోరుచిక్కుడు ఉల్లి మసాలా రెసిపీ

కావాల్సిన పదార్ధాలు: గోరు చిక్కుడు -250 గ్రాములు నూనె -3 టేబుల్ స్పూన్స్ ఉల్లిపాయలు -2 పచ్చిమిర్చి -3 ఆవాలు -2 టీస్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ -1 టీస్పూన్ పసుపు – 1/2 టీస్పూన్ కారం -1 టీస్పూన్ గరం మసాలా -1/4 టీస్పూన్ ధనియాల పొడి -1/2 టీస్పూన్ జీలకర్ర పొడి -1/4 టీస్పూన్ కరివేపాకు -రెండు రెమ్మలు ఉప్పు -తగినంత తయారీ విధానం: ముందుగా గోరు చిక్కుడును చిన్న ముక్కలుగా కట్ చేసి […]

Update: 2021-01-28 01:26 GMT

కావాల్సిన పదార్ధాలు:

గోరు చిక్కుడు -250 గ్రాములు
నూనె -3 టేబుల్ స్పూన్స్
ఉల్లిపాయలు -2
పచ్చిమిర్చి -3
ఆవాలు -2 టీస్పూన్స్
అల్లం వెల్లుల్లి పేస్ట్ -1 టీస్పూన్
పసుపు – 1/2 టీస్పూన్
కారం -1 టీస్పూన్
గరం మసాలా -1/4 టీస్పూన్
ధనియాల పొడి -1/2 టీస్పూన్
జీలకర్ర పొడి -1/4 టీస్పూన్
కరివేపాకు -రెండు రెమ్మలు
ఉప్పు -తగినంత

తయారీ విధానం:

ముందుగా గోరు చిక్కుడును చిన్న ముక్కలుగా కట్ చేసి వాటిని ఉప్పు వేసి ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒక బాణీలో నూనె వేడిచేసి అందులో ఆవాలు వేసుకోవాలి. దీనిలో ఉల్లిపాయ పేస్ట్‌, అల్లం వెల్లుల్లి పేస్ట్‌ను వేసుకోవాలి. రెండు నిమిషాల తర్వాత పచ్చిమిర్చిని వేసుకోని ఫ్రై చేసుకోవాలి. దీనిలో కరివేపాకు, పసుపు, కారం, గరంమసాలా, ధనియాల పొడి, జీలకర్ర పొడి, తగినంత ఉప్పు వేసుకుని కలుపుకోవాలి. రెండు నిమిషాల తర్వాత ఈ మిశ్రమంలో ఉడికించి పక్కన పెట్టుకున్న గోరుచిక్కుడును వాటర్‌తో సహా వేసుకోవాలి. దీనిపై మూత పెట్టి మిశ్రమంలో నీళ్లు ఇంకిపోయేవరకు సన్నని మంటపై ఉడికించుకోవాలి. ఇప్పుడు కొత్తిమీర వేసి దింపేసుకుంటే టేస్టీ గోరుచిక్కుడు ఉల్లిమసాలా రెడీ..

గోరుచిక్కుడు వల్ల ఎన్ని లాభాలో..

Full View

Tags:    

Similar News