సీనియర్ హీరో ఇంట్లో పెళ్లి సందడి.. పెళ్లి డేట్ కూడా ఫిక్స్!

సీనియర్ హీరో అర్జున్ ఇంట పెళ్లి సందడి మొదలవనుంది. యాక్షన్ హీరోగా మంచి పేరు తెచ్చుకున్న నటుడు అర్జున్. ఈయన చాలా సినిమాల్లో నటించి ప్రేక్షకుల మనసు గెలుచుకున్నాడు. అయితే ఈ నటుడికి ఇద్దరు కూతుర్లు ఉన్న

Update: 2024-05-08 04:19 GMT

దిశ, సినిమా : సీనియర్ హీరో అర్జున్ ఇంట పెళ్లి సందడి మొదలవనుంది. యాక్షన్ హీరోగా మంచి పేరు తెచ్చుకున్న నటుడు అర్జున్. ఈయన చాలా సినిమాల్లో నటించి ప్రేక్షకుల మనసు గెలుచుకున్నాడు. అయితే ఈ నటుడికి ఇద్దరు కూతుర్లు ఉన్న విషయం తెలిసిందే. ఆయనకు తన కూతుర్లంటే అమితమైన ప్రేమ.. వారిని ఎంతో గారాబంగా పెంచారు. అంతే కాకుండా వారి పెళ్లి విషయంలో కూడా అర్జున్ ఎప్పుడూ షరతులు అనేది పెట్టలేదంట.. తన పెద్ద కూతురు ఐశ్వర్య ఉమాపతిలతో ప్రేమలో పడింది. ఓ షోలో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారడంతో.. ఆ విషయాన్ని ఐశ్వర్య తన తండ్రికి చెప్పడంతో వారి ప్రేమను యాక్సెప్ట్ చేసి నిశ్చితార్థం కూడా చేసిన విషయం తెలిసిందే.

అర్జున్ తనకు ఎంతో ఇష్టమైన హనుమాన్ ఆలయంలో అక్టోబర్ 10న తన కూతురు ఐశ్వర్యకు, ఉమాపతిలకు ఘనంగా నిశ్చితార్థం చేశారు. అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆమె పెళ్లి డేట్‌పై ఎలాంటి సమాచారం లేదు. దీంతో చాలా మంది ఎంగేజ్‌మెంట్ జరిగి చాలా రోజులవుతుంది? ఇంకా ఎందుకు ఐశ్వర్య అర్జున్ పెళ్లి డేట్ రివీల్ చేయడం లేదంటూ సోషల్ మీడియాలో తెగ చర్చ జరిగింది. పలు రకాల రూమర్స్ కూడా వినిపించాయి. కానీ ఎట్టకేలకు వాటికి చెక్ పెడుతూ అర్జున్ తన కూతురు పెళ్లి డేట్ అధికారికంగా అనౌన్స్ చేయనున్నారు. తమిళ మీడియాలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఐశ్వర్య, ఉపాపతిల వివాహం జూన్ 10న జరుగుతున్నట్లు తెలుస్తోంది. అంతే కాకుండా తాను నిర్మించిన, ఎంగేజ్మెంట్ చేసిన హనుమాన్ ఆలయంలో వివాహం జరిపించబోతున్నట్లు సమాచారం. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రానుంది. ఇక ఐశ్వర్య అర్జున్ హీరోయిన్‌గా పలు సినిమాల్లో నటించినప్పటికి ఆమె నటిగా మంచి గుర్తింపును సొంతం చేసుకోలేకపోయింది. దీంతో ఆమె సినిమాలకు కూడా కాస్త దూరంగానే ఉంటున్నట్లు తెలుస్తోంది.

Similar News