గోవా ప్రియులకు ముఖ్య గమనిక.. రాత్రి సమయంలో జాగ్రత్త..!

దిశ, వెబ్‌డెస్క్: భారత్‌లో ప్రఖ్యాత టూరిస్ట్ ప్లేస్‌గా పేరుగాంచిన గోవాలో కరోనా కొనసాగుతూనే ఉంది. నైట్ లైఫ్‌కు కేరాఫ్‌గా నిలిచే పర్యాటక ప్రాంతం దేశంలోనే ఏదైనా ఉందంటే అది గోవా అనే చెబుతారు. అటువంటి రాష్ట్రంలో కరోనా దెబ్బతో ఏప్రిల్ 21 నుంచి నైట్ కర్ఫ్యూ విధిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో పర్యాటక రంగం ఒక్కసారిగా కుదేలైంది. సెకండ్ వేవ్ కొనసాగుతన్న నేపథ్యంలో కర్ఫ్యూను పొడిగిస్తూ వస్తోంది అక్కడి ప్రభుత్వం. ఈ క్రమంలోనే నైట్ లైఫ్‌పై […]

Update: 2021-06-07 07:30 GMT

దిశ, వెబ్‌డెస్క్: భారత్‌లో ప్రఖ్యాత టూరిస్ట్ ప్లేస్‌గా పేరుగాంచిన గోవాలో కరోనా కొనసాగుతూనే ఉంది. నైట్ లైఫ్‌కు కేరాఫ్‌గా నిలిచే పర్యాటక ప్రాంతం దేశంలోనే ఏదైనా ఉందంటే అది గోవా అనే చెబుతారు. అటువంటి రాష్ట్రంలో కరోనా దెబ్బతో ఏప్రిల్ 21 నుంచి నైట్ కర్ఫ్యూ విధిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో పర్యాటక రంగం ఒక్కసారిగా కుదేలైంది. సెకండ్ వేవ్ కొనసాగుతన్న నేపథ్యంలో కర్ఫ్యూను పొడిగిస్తూ వస్తోంది అక్కడి ప్రభుత్వం. ఈ క్రమంలోనే నైట్ లైఫ్‌పై గోవా పోర్ట్స్ మినిస్టర్ మైఖేల్ లోబో కీలక వ్యాఖ్యలు చేశారు.

ఇప్పట్లో నైట్‌లైఫ్ గురించి ఆలోచించవద్దని.. కరోనా మహమ్మారి తగ్గిన తర్వాతే గోవాలో కర్ఫ్యూ ఎత్తివేస్తామని చెప్పారు. సోమవారం సీఎం అధ్యక్షతన జరిగిన అత్యున్నత స్థాయి సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నైట్ కర్ఫ్యూలో ప్రజలు రోడ్ల మీదకు రావొద్దని సూచించారు. రాత్రి 10 గంటల నుంచి మరుసటి ఉదయం 6 గంటల వరకు.. కేవలం పరిశ్రమలు, పెట్రోల్ బంకులు, నిత్యావసరాలకు మాత్రమే అనుమతి ఇస్తున్నట్టు స్పష్టం చేశారు. నైట్ లైఫ్ కంటే ప్రజల ఆరోగ్యం ముఖ్యమన్న కారణంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు మినిస్టర్ నొక్కి చెప్పారు. కర్ఫ్యూ మినహాయంపు సమయంలో గోవాకు వస్తున్న పర్యాటకులు.. నెగెటివ్ రిపోర్టు ఉంటేనే హోటళ్ళలో రూమ్‌లు అద్దెకు ఇస్తున్నారని.. ఈ విషయాన్ని గ్రహించవల్సిందిగా సూచించారు మైఖేల్ లోబో.

Tags:    

Similar News