నాలా పూడికతీత పనులు తనిఖీ చేసిన మేయర్

దిశ, న్యూస్​ బ్యూరో: నాలా ముంపు సమస్యను అధిగమించేందుకు పూడికతీత పనులను ఈ నెలాఖరుకు పూర్తి చేయనున్నట్లు జిహెచ్ఎంసి మేయర్ బొంతు రామ్మోహన్ తెలిపారు. శనివారం షేక్ పేట్ ఓయూ కాలనీ వద్ద జరుగుతున్న పూడికతీత పనులను పరిశీలించారు. మేయర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ,సిటీలోని 1,295 కిలోమీటర్లు నాలాల్లో 390 కిలోమీటర్లు పొడవు‌లో 54 ప్రధాన ఓపెన్ నాలాలు ఉన్నాయని తెలిపారు. గత మూడేండ్లుగా తీసుకున్న చర్యలు వలన నాలాల్లో కొంత పూడిక తగ్గినట్లు తెలిపారు. రాష్ట్ర […]

Update: 2020-05-09 06:13 GMT

దిశ, న్యూస్​ బ్యూరో: నాలా ముంపు సమస్యను అధిగమించేందుకు పూడికతీత పనులను ఈ నెలాఖరుకు పూర్తి చేయనున్నట్లు జిహెచ్ఎంసి మేయర్ బొంతు రామ్మోహన్ తెలిపారు. శనివారం షేక్ పేట్ ఓయూ కాలనీ వద్ద జరుగుతున్న పూడికతీత పనులను పరిశీలించారు. మేయర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ,సిటీలోని 1,295 కిలోమీటర్లు నాలాల్లో 390 కిలోమీటర్లు పొడవు‌లో 54 ప్రధాన ఓపెన్ నాలాలు ఉన్నాయని తెలిపారు. గత మూడేండ్లుగా తీసుకున్న చర్యలు వలన నాలాల్లో కొంత పూడిక తగ్గినట్లు తెలిపారు.

రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు నగరాన్ని అందంగా తీర్చిదిద్దుతున్నట్లు తెలిపారు. వర్షాకాలంలో ఎదురవుతున్న వరద ముంపును అధిగమించేందుకు నాలాలను వార్షిక నిర్వహణకు అప్పగించినట్లు తెలిపారు. ఈ సంవత్సరం రూ.41.38 కోట్ల వ్యయంతో నాలాల పూడికను చేపట్టినట్టు వివరించారు. ఇరుకుగా ఉన్న చోట 16 కిలోమీటర్ల వరకు నాలాల విస్తరణ చేస్తున్నట్లు తెలిపారు. 75 శాతం నాలాల విస్తరణ పనులు పూర్తి అయినట్లు మేయర్ తెలిపారు. ఈ పర్యటనలో కార్పొరేటర్ సాయిబాబా, జోనల్ కమిషనర్ ఎన్.రవికిరణ్, డిప్యూటీ కమిషనర్ వెంకన్న పాల్గొన్నారు.

Tags:    

Similar News