జార్జ్ ఫ్లాయిడ్‌ది హత్యే.. పోస్టుమార్టం రిపోర్టులో వెల్లడి

వాషింగ్టన్: ఆఫ్రికన్-అమెరికన్ జాతీయుడైన జార్జ్ ఫ్లాయిడ్‌ది ముమ్మాటికి నరహత్యే అని తేలింది. ఇప్పటికే జార్జ్ హత్యపై అమెరికా వ్యాప్తంగా ఆందోళనలు మిన్నంటాయి. ఈ నేపథ్యంలో జార్జ్ పోస్టు మార్టమ్ రిపోర్టు బయటకు వెలువడటం మరింత సంచలనంగా మారింది. జార్జి మెడపై తీవ్రమైన ఒత్తిడి కారణంగానే ఆయన మరణించినట్టు శవపరీక్ష చేసిన వైద్యులు తేల్చారు. పోస్టుమార్టం రిపోర్టును బట్టి, ప్రత్యక్ష సాక్షుల కథనాలను బట్టి దీన్ని నరహత్య అని పేర్కొనవచ్చని వైద్యులు అభిప్రాయపడ్డారు. ఆయనకు గుండెకు సంబంధిత సమస్యలు, […]

Update: 2020-06-02 08:15 GMT

వాషింగ్టన్: ఆఫ్రికన్-అమెరికన్ జాతీయుడైన జార్జ్ ఫ్లాయిడ్‌ది ముమ్మాటికి నరహత్యే అని తేలింది. ఇప్పటికే జార్జ్ హత్యపై అమెరికా వ్యాప్తంగా ఆందోళనలు మిన్నంటాయి. ఈ నేపథ్యంలో జార్జ్ పోస్టు మార్టమ్ రిపోర్టు బయటకు వెలువడటం మరింత సంచలనంగా మారింది. జార్జి మెడపై తీవ్రమైన ఒత్తిడి కారణంగానే ఆయన మరణించినట్టు శవపరీక్ష చేసిన వైద్యులు తేల్చారు. పోస్టుమార్టం రిపోర్టును బట్టి, ప్రత్యక్ష సాక్షుల కథనాలను బట్టి దీన్ని నరహత్య అని పేర్కొనవచ్చని వైద్యులు అభిప్రాయపడ్డారు. ఆయనకు గుండెకు సంబంధిత సమస్యలు, హైపర్ టెన్షన్ ఉన్నట్టు కుటుంబ సభ్యులు చెప్పారు. అయితే సదరు పోలీసు జార్జి మెడపై తన మోకాలితో బలంగా నొక్కడం వల్లే గుండె ఆగి చనిపోయాడని పోస్టుమార్టమ్ రిపోర్టులో నమోదు చేశారు. జార్జ్ శవ పరీక్ష నివేదిక వచ్చిన తర్వాత ఆందోళనకారులు మరింత ఆగ్రహంతో రగిలిపోయారు. న్యూయార్క్, మిన్నెపోలీస్, వాషింగ్టన్ నగరాల్లో వీధుల్లోకి వచ్చి తన నిరసన తెలిపారు.

Tags:    

Similar News