ఢిల్లీకి సీఎం వెంట మాజీ మంత్రి లక్ష్మారెడ్డి.. పార్టీ వర్గాల్లో రసవత్తర చర్చ

దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్: రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ వెంట మాజీ మంత్రి, జడ్చర్ల ఎమ్మెల్యే డాక్టర్ సి లక్ష్మారెడ్డి ఢిల్లీ వెళ్లడం పార్టీ వర్గాలలో హాట్ టాపిక్ గా మారింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నుండి ముఖ్యమంత్రి కేసీఆర్ వెంట ఉన్న లక్ష్మారెడ్డి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు ఒకసారి ఎమ్మెల్యే గా పని చేయడం, పార్టీ అధినేత కేసీఆర్ పిలుపుతో అప్పట్లో తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన మొదటి ఎమ్మెల్యే గా నిలిచాడు. […]

Update: 2021-09-24 12:08 GMT

దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్: రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ వెంట మాజీ మంత్రి, జడ్చర్ల ఎమ్మెల్యే డాక్టర్ సి లక్ష్మారెడ్డి ఢిల్లీ వెళ్లడం పార్టీ వర్గాలలో హాట్ టాపిక్ గా మారింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నుండి ముఖ్యమంత్రి కేసీఆర్ వెంట ఉన్న లక్ష్మారెడ్డి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు ఒకసారి ఎమ్మెల్యే గా పని చేయడం, పార్టీ అధినేత కేసీఆర్ పిలుపుతో అప్పట్లో తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన మొదటి ఎమ్మెల్యే గా నిలిచాడు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం 2014లో జరిగిన ఎన్నికలలో జడ్చర్ల నియోజకవర్గం నుండి గెలుపొందిన లక్ష్మారెడ్డి కి రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రిగా అవకాశం కల్పించారు. ఆరోగ్య శాఖ మంత్రిగా సమర్థవంతంగా పని చేసినప్పటికీ 2018 లో జరిగిన ఎన్నికల అనంతరం ఉమ్మడి పాలమూరు జిల్లా సమీకరణాల కారణంగా ఆయనకు మంత్రి పదవి లభించలేదు. పార్టీ అధిష్టానం నిర్ణయం మేరకు ఎమ్మెల్యేగా కొనసాగుతూ జడ్చర్ల నియోజకవర్గంలో పార్టీని మరింత బలోపేతం చేయడంపై దృష్టి సారించారు.

ఈ క్రమంలో ఆ మధ్య జరిగిన జడ్చర్ల మున్సిపాలిటీ ఎన్నికలలో అభ్యర్థులను ఒంటిచేత్తో గెలిపించుకోగలదు గారు. లక్ష్మారెడ్డి కి రాష్ట్ర స్థాయిలో కొంత ప్రాధాన్యత తగ్గిన అవన్నీ పార్టీ ప్రయోజనాల కోసమే అన్న చందంగా వ్యవహరిస్తూ వస్తున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ పర్యటనకు వెళుతూ వెళుతూ శుక్రవారం డాక్టర్ లక్ష్మారెడ్డి ని వెంట తీసుకు వెళ్లడం చర్చనీయాంశంగా మారింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఎప్పుడు ఢిల్లీ వెళ్లిన మంత్రులు, ఎంపీల లో కొంతమంది మాత్రమే ఉండేవారు. అటువంటిది ఢిల్లీ పర్యటనకు వెళుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రులు, ఎంపీలను ఎవరిని తీసుకు వెళ్లకుండా కేవలం తన వెంట లక్ష్మారెడ్డి ని మాత్రమే తీసుకు వెళ్లడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. దీనితో జడ్చర్ల నియోజకవర్గంలో తమ ఎమ్మెల్యేకు త్వరలోనే మంచి రోజులు వస్తాయన్న ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు.

Tags:    

Similar News