అలవాటులో పొరపాటు.. ప్రధాని చైర్‌లో కూర్చున్న ప్రతిపక్షనేత

దిశ, వెబ్‌డెస్క్: ఇజ్రాయెల్ ప్రధానమంత్రిగా 12 సంవత్సరాలు సేవలందించిన బెంజమిన్ నెతన్యాహు పదవీకాలం ముగిసింది. నేషనలిస్ట్ పార్టీకి చెందిన నఫ్తాలీ బెన్నెట్ సారథ్యంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత పార్లమెంట్‌లో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. ప్రధాని నెతన్యాహుకు వ్యతిరేకంగా నిర్వహించిన విశ్వాస పరీక్షలో ఆయన ఓడిపోయారు. ఓటింగ్ ప్రక్రియ ముగిసిన అనంతరం ఆయన తనకు కేటాయించిన సీటు వద్దకు కాకుండా అలవాటులో పొరపాటుగా ప్రధానమంత్రి కుర్చీలో కూర్చున్నారు. అది చూసిన సభ్యులు ప్రతిపక్షాలకు కేటాయించిన […]

Update: 2021-06-16 05:27 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఇజ్రాయెల్ ప్రధానమంత్రిగా 12 సంవత్సరాలు సేవలందించిన బెంజమిన్ నెతన్యాహు పదవీకాలం ముగిసింది. నేషనలిస్ట్ పార్టీకి చెందిన నఫ్తాలీ బెన్నెట్ సారథ్యంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత పార్లమెంట్‌లో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. ప్రధాని నెతన్యాహుకు వ్యతిరేకంగా నిర్వహించిన విశ్వాస పరీక్షలో ఆయన ఓడిపోయారు. ఓటింగ్ ప్రక్రియ ముగిసిన అనంతరం ఆయన తనకు కేటాయించిన సీటు వద్దకు కాకుండా అలవాటులో పొరపాటుగా ప్రధానమంత్రి కుర్చీలో కూర్చున్నారు. అది చూసిన సభ్యులు ప్రతిపక్షాలకు కేటాయించిన సీటులోకి వెళ్లాలని కోరారు. దాంతో ఇకపై అది తన సీటు కాదని గ్రహించి వెంటనే లేచి మళ్లీ తన సీట్‌లోకి వెళ్లిపోయారు నెతన్యాహు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Tags:    

Similar News