పాక్‌ ఉప ప్రధానిగా నవాజ్ షరీఫ్ నమ్మిన బంటు

దిశ, నేషనల్ బ్యూరో : పాకిస్తాన్ ఉప ప్రధానమంత్రిగా ఆ దేశ విదేశాంగ శాఖ మంత్రి ఇశాక్‌ దార్ నియమితులయ్యారు.

Update: 2024-04-28 17:07 GMT

దిశ, నేషనల్ బ్యూరో : పాకిస్తాన్ ఉప ప్రధానమంత్రిగా ఆ దేశ విదేశాంగ శాఖ మంత్రి ఇశాక్‌ దార్ నియమితులయ్యారు. ఈయన నవాజ్ షరీఫ్‌కు చెందిన పీఎంఎల్‌-ఎన్‌ పార్టీ సీనియర్‌ నేతల్లో ఒకరు. ప్రొఫెషనల్‌గా ఇశాక్‌ దార్ ఒక చార్టెడ్‌ అకౌంటెంట్‌. షరీఫ్‌ కుటుంబానికి అత్యంత సన్నిహితుడైన దార్ గతంలో రెండు సార్లు ఆర్థికమంత్రిగా సేవలందించారు. ఆయన నియామకంపై పాక్ కేబినెట్‌ ఆదివారం ఓ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ ఏడాది జరిగిన పాకిస్తాన్ జనరల్‌ అసెంబ్లీ ఎన్నికల్లో పాకిస్తాన్ పీపుల్స్‌ పార్టీ (పీపీపీ) మద్దతుతో షెహబాజ్ షరీఫ్‌ నేతృత్వంలో పీఎంఎల్‌(ఎన్‌) ప్రభుత్వం ఏర్పాటు చేసింది. పొత్తులో భాగంగా దేశ అధ్యక్ష పదవి పీపీపీ సహ ఛైర్మన్‌ ఆసిఫ్‌ అలీ జర్దారీకి, ప్రధానమంత్రి పదవి నవాజ్ షరీఫ్ సోదరుడు షెహబాజ్ షరీఫ్‌కు దక్కాయి.

Tags:    

Similar News