ప్రపంచంలో అతిపెద్దది.. 400 గేట్లు.. దుబాయ్ ఎయిర్ పోర్టు విశేషాలివే..!

దుబాయ్ లో దాదాపు 2.9 లక్షల కోట్లతో ఎయిర్ పోర్టుని నిర్మించనున్నారు. దుబాయ్ రూలర్ షేక్ మహ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ ఆదివారం ఈ ప్రాజెక్టుని ప్రకటించారు.

Update: 2024-04-28 18:11 GMT

దిశ, నేషనల్ బ్యూరో : దుబాయ్ లో దాదాపు 2.9 లక్షల కోట్లతో ఎయిర్ పోర్టుని నిర్మించనున్నారు. దుబాయ్ రూలర్ షేక్ మహ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ ఆదివారం ఈ ప్రాజెక్టుని ప్రకటించారు. దూబాయ్ లో వరల్డ్ ఎయిర్ పోర్టు, దాని నౌకాశ్రయం, అర్బన్ హబ్, న్యూ గ్లోబల్ సెంటర్ ఏర్పడనున్నట్లు తెలిపారు.

కొత్త విమానాశ్రయం పేరుని అల్ మక్తూమ్ అంతర్జాతీయ ఎయిర్ పోర్టుగా ప్రకటించారు. దానిలో 5 సమాంతర రన్ వేలు ఉండనున్నాయి. ఎయిర్ పోర్టు సామర్థ్యం 26 లక్షల మంది ప్రయాణికులు కాగా.. 400 ఎయిర్ క్రాఫ్ట్స్ గేట్స్ ఉన్నాయి. పిల్లలు, వారి పిల్లల కోసం నిరంతర, స్థిరమైన అభివృద్ధి గురించే ఈ కొత్త ప్రాజెక్టు అని దుబాయ్ రూలర్ సోషల్ మీడియాలో చెప్పుకొచ్చారు.

అల్ మక్తూమ్ అంతర్జాతీయ విమానాశ్రయం ఏడాదికి 26 లక్షల మంది ప్రయాణీకులతో ప్రపంచంలోనే అతిపెద్ద సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లోని అన్ని కార్యకలాపాలు అన్నీ కొత్త ఎయిర్ పోర్టుకు బదిలీ చేయనున్నారు. విమానాశ్రయంలో 400 ఎయిర్‌క్రాఫ్ట్ గేట్లు, ఐదు సమాంతర రన్‌వేలు ఉంటాయి. దుబాయ్ విమానయాన రంగం తొలిసారిగా కొత్త ఏవియేషన్ టెక్నాలజీలను చూడనుంది. దుబాయ్ సౌత్‌లోని విమానాశ్రయం చుట్టూ మొత్తం సిటీని నిర్మించనున్నారు. ఈ విమానాశ్రయం లాజిస్టిక్స్, ఎయిర్ ట్రాన్స్ పోర్ట్ రంగాల్లో ప్రపంచ కంపెనీలకు ఆతిథ్యం ఇవ్వనుంది.

Similar News