‘ఆదివారం ఐపీఎల్ షెడ్యూల్’

దిశ, స్పోర్ట్స్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) యూఏఈకి తరలిపోయిన విషయం అందరికీ తెలిసిందే. అయితే గల్ఫ్‌లోనే లీగ్ జరుగుతుందని చెప్పిన బీసీసీఐ (BCCI) ఈనాటి వరకు పూర్తి షెడ్యూల్ విడుదల చేయకపోవడం అనుమానాలకు తావిస్తున్నది. చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టులో 13 మంది కోవిడ్ బారిన పడటం కారణంగానే ఈ షెడ్యూల్ ఆలస్యం అయ్యిందని వార్తలు వచ్చాయి. అయితే బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ శుక్రవారం ఐపీఎల్ షెడ్యూల్ ప్రకటిస్తామని చెప్పడంతో అందరూ ఊపిరి […]

Update: 2020-09-05 10:43 GMT

దిశ, స్పోర్ట్స్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) యూఏఈకి తరలిపోయిన విషయం అందరికీ తెలిసిందే. అయితే గల్ఫ్‌లోనే లీగ్ జరుగుతుందని చెప్పిన బీసీసీఐ (BCCI) ఈనాటి వరకు పూర్తి షెడ్యూల్ విడుదల చేయకపోవడం అనుమానాలకు తావిస్తున్నది. చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టులో 13 మంది కోవిడ్ బారిన పడటం కారణంగానే ఈ షెడ్యూల్ ఆలస్యం అయ్యిందని వార్తలు వచ్చాయి. అయితే బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ శుక్రవారం ఐపీఎల్ షెడ్యూల్ ప్రకటిస్తామని చెప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

కానీ, ఆనాటి నుంచి ఇప్పటి వరకు షెడ్యూల్ విడుదల కాకపోవడంతో క్రికెట్ అభిమానులు ఆందోళనలో ఉన్నారు. అయితే ఐపీఎల్ 13వ సీజన్ పూర్తి షెడ్యూల్ ఆదివారం ప్రకటిస్తామని గవర్నింగ్ కౌన్సిల్ చైర్మన్ (Chairman of the Governing Council)బ్రిజేష్ పటేల్ చెప్పారు. అబుదాబి, దుబాయ్, షార్జా స్టేడియంలలో నే ఐపీఎల్ మ్యాచ్‌లు జరుగుతాయని, కానీ కొన్ని సాంకేతిక కారణాల వల్ల శుక్రవారం ప్రకటించాల్సిన షెడ్యూల్ ఆదివారానికి మార్చామని ఆయన చెప్పారు.

Tags:    

Similar News