కల్తీ కల్లు తాగి ఐదుగురికి అస్వస్థత

దిశ, నర్సాపూర్ : మెదక్ జిల్లా శివ్వంపేట మండలంలోని పలు గ్రామాల్లో కల్లు అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. కల్తీ కల్లును నిరోధించే జిల్లా ఎక్సైజ్ అధికారులు కల్లు కాంట్రాక్టర్ల నుండి అందే మామూళ్ల మత్తులో మునిగి తెలుతుండగా, కల్తీకల్లు తాగి ఎంతో మంది ప్రజలు తీవ్ర అస్వస్థతకు గురైనా ఆబ్కారీశాఖ అధికారులు అటువైపు కన్నెత్తి చూడడం లేదని తీవ్ర స్థాయిలో మండల ప్రజలు విరుచుకుపడుతున్నారు. శివ్వంపేట మండలంలోని కొంతాన్ పల్లి గ్రామంలో మంగళవారం కల్లు తాగి పలువురు […]

Update: 2021-12-28 10:51 GMT

దిశ, నర్సాపూర్ : మెదక్ జిల్లా శివ్వంపేట మండలంలోని పలు గ్రామాల్లో కల్లు అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. కల్తీ కల్లును నిరోధించే జిల్లా ఎక్సైజ్ అధికారులు కల్లు కాంట్రాక్టర్ల నుండి అందే మామూళ్ల మత్తులో మునిగి తెలుతుండగా, కల్తీకల్లు తాగి ఎంతో మంది ప్రజలు తీవ్ర అస్వస్థతకు గురైనా ఆబ్కారీశాఖ అధికారులు అటువైపు కన్నెత్తి చూడడం లేదని తీవ్ర స్థాయిలో మండల ప్రజలు విరుచుకుపడుతున్నారు. శివ్వంపేట మండలంలోని కొంతాన్ పల్లి గ్రామంలో మంగళవారం కల్లు తాగి పలువురు గ్రామస్తులు తీవ్ర అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

కొంతాన్ పల్లి గ్రామానికి చెందిన ఓ కల్లు దుకాణంలో కల్లు తాగిన కుల్ల నాగరాజు, బ్యాగరి మనీలా, మడురి రమేష్, వీరబోయిన స్వామి, తుమ్మల స్వామి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కాళ్లు, చేతులు, మెడలు వంకర తిరిగి పరిస్థితి విషమించడంతో హైదరాబాద్‌లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. పక్క గ్రామమైన తూప్రాన్ మండలం వట్టురు గ్రామంలో కూడా ఇదే కాంట్రాక్టర్‌కు చెందిన కల్లు దుకాణంలో పలువురు తీవ్ర అస్వస్థతకు గురైనట్టు గ్రామస్తులు తెలిపారు.

Tags:    

Similar News