సైన్యంలోకి 'కరోనా'

శ్రీనగర్: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ ఇప్పడు భారత సైన్యంలోకీ ఎంటరైంది. జమ్ముకశ్మీర్‌లోని లడఖ్ స్కౌట్స్‌లో విధులు నిర్వర్తిస్తున్న ఓ జవాన్‌.. ఈ రాకాసి బారిన పడినట్టు ఇండియన్ ఆర్మీ వెల్లడించింది. జవాన్ తండ్రి ఇరాన్‌లో తీర్థయాత్రలకు వెళ్లి ఇటీవలే స్వదేశానికి తిరిగి రాగా, ఆయనకూ కరోనా టెస్టుల్లో పాజిటివ్ వచ్చింది. తండ్రి నుంచే జవాన్‌కు ఈ వైరస్ సోకినట్టు అధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో బాధితుడి కుటుంబ సభ్యులందరినీ వైద్య పర్యవేక్షణలో ఉంచారు. కాగా, సైన్యంలో […]

Update: 2020-03-17 21:10 GMT

శ్రీనగర్: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ ఇప్పడు భారత సైన్యంలోకీ ఎంటరైంది. జమ్ముకశ్మీర్‌లోని లడఖ్ స్కౌట్స్‌లో విధులు నిర్వర్తిస్తున్న ఓ జవాన్‌.. ఈ రాకాసి బారిన పడినట్టు ఇండియన్ ఆర్మీ వెల్లడించింది. జవాన్ తండ్రి ఇరాన్‌లో తీర్థయాత్రలకు వెళ్లి ఇటీవలే స్వదేశానికి తిరిగి రాగా, ఆయనకూ కరోనా టెస్టుల్లో పాజిటివ్ వచ్చింది. తండ్రి నుంచే జవాన్‌కు ఈ వైరస్ సోకినట్టు అధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో బాధితుడి కుటుంబ సభ్యులందరినీ వైద్య పర్యవేక్షణలో ఉంచారు. కాగా, సైన్యంలో తొలి కరోనా కేసు నమోదవ్వడంతో ఆర్మీ అప్రమత్తమైంది.

Tags: coronavirus, indian army, jammu kashmir, iran, corona to indian army

Tags:    

Similar News