ఏపీలో విస్తారంగా వర్షాలు

దిశ ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఆదివారం సాయంత్రం నుంచి ఎడతెరిపి లేకుండా వాన పడుతూనే ఉంది. ఆగ్నేయ ఉత్తరప్రదేశ్‌ నుంచి దక్షిణ ఛత్తీస్‌గఢ్‌ వరకూ ఏర్పడిన ఉత్తర–దక్షిణ ఉపరితల ద్రోణి బలహీనపడింది. దీంతో ఏర్పడిన గాలుల కలయికతో ఏర్పడిన షియర్‌ జోన్‌ ప్రభావం ఆంధ్రప్రదేశ్ పై పడింది. అదే సమయంలో నైరుతి రుతు పవనాలు కోస్తా, రాయలసీమపై చురుగ్గా కదులుతున్నాయి. దీంతో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. నేడు, రేపు […]

Update: 2020-07-12 22:04 GMT

దిశ ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఆదివారం సాయంత్రం నుంచి ఎడతెరిపి లేకుండా వాన పడుతూనే ఉంది. ఆగ్నేయ ఉత్తరప్రదేశ్‌ నుంచి దక్షిణ ఛత్తీస్‌గఢ్‌ వరకూ ఏర్పడిన ఉత్తర–దక్షిణ ఉపరితల ద్రోణి బలహీనపడింది. దీంతో ఏర్పడిన గాలుల కలయికతో ఏర్పడిన షియర్‌ జోన్‌ ప్రభావం ఆంధ్రప్రదేశ్ పై పడింది. అదే సమయంలో నైరుతి రుతు పవనాలు కోస్తా, రాయలసీమపై చురుగ్గా కదులుతున్నాయి. దీంతో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. నేడు, రేపు కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. దీంతో ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ ఆశావహంగా ఆరంభమవుతుందని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Tags:    

Similar News