బీజేపీపై ఈటల తొలిసారి మాట్లాడింది ఇదే..

దిశ సిద్దిపేట: హుజురాబాద్ నియోజక వర్గంలో ఎగిరేది ఖచ్చితంగా బీజేపీ జెండానే.. అని మాజీ మంత్రి బీజేపీ నేత ఈటల రాజేందర్ అన్నారు. హైదరాబాదు నుంచి హుజురాబాద్ వెళ్తూ సిద్దిపేట రంగదాం పల్లి చౌరస్తాలో అమర వీరుల స్థూపనికి బీజేపీ నేతలు స్వామి గౌడ్, వివేక్, ఏనుగు రవీందర్ రెడ్డితో కలిసి మాజీ మంత్రి ఈటల రాజేందర్ నివాళులు అర్పించారు. ఈసందర్బంగా ఈటల రాజేందర్‌కు బీజేపీ శ్రేణులు దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు ఘనస్వాగతం పలికారు. ఈ […]

Update: 2021-06-16 23:16 GMT

దిశ సిద్దిపేట: హుజురాబాద్ నియోజక వర్గంలో ఎగిరేది ఖచ్చితంగా బీజేపీ జెండానే.. అని మాజీ మంత్రి బీజేపీ నేత ఈటల రాజేందర్ అన్నారు. హైదరాబాదు నుంచి హుజురాబాద్ వెళ్తూ సిద్దిపేట రంగదాం పల్లి చౌరస్తాలో అమర వీరుల స్థూపనికి బీజేపీ నేతలు స్వామి గౌడ్, వివేక్, ఏనుగు రవీందర్ రెడ్డితో కలిసి మాజీ మంత్రి ఈటల రాజేందర్ నివాళులు అర్పించారు. ఈసందర్బంగా ఈటల రాజేందర్‌కు బీజేపీ శ్రేణులు దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ..ఉద్యమ ఆకాంక్షలు నెరవేరలేదనీ.. బీసీ ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలు ప్రత్యేక రాష్ట్రంలోనూ వెనుకబాటుకు గురయ్యారన్నారు. వారందరినీ కలుపుకుని బీజేపీ ముందుకెళ్తుందనీ తెలిపారు. 2023లో రాష్ట్రంలో కాషాయ జెండా ఎగుర వేస్తామని ధీమా వ్యక్తంచేశారు. అనంతరం హుజరాబాద్ బయలుదేరి వెళ్లారు.

Tags:    

Similar News