తెలంగాణ సాంఘిక సంక్షేమ సైనిక పాఠశాలలో 6వ తరగతి ప్రవేశాలు
మిలిటరీ ఎడ్యుకేషన్, త్రివిధ దళాల్లో అధికారుల నియామకాల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం కరీంనగర్ జిల్లా రుక్మాపూర్ లో తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల సైనిక పాఠశాలను బాలుర కోసం ప్రత్యేకంగా ప్రారంభించింది.
దిశ, ఎడ్యుకేషన్: మిలిటరీ ఎడ్యుకేషన్, త్రివిధ దళాల్లో అధికారుల నియామకాల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం కరీంనగర్ జిల్లా రుక్మాపూర్ లో తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల సైనిక పాఠశాలను బాలుర కోసం ప్రత్యేకంగా ప్రారంభించింది. 2023- 23 విద్యా సంవత్సరానికి 6వ తరగతి అడ్మిషన్ కోసం అర్హులైన బాలుర నుంచి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు:
6 వ తరగతి ప్రవేశాలు: 80 సీట్లు.
గ్రూపులు: ఎంపీసీ
రిజర్వేషన్లు వర్తిస్తాయి.
సంస్థ: తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల సైనిక పాఠశాల, కుర్మాపూర్, కరీంనగర్ జిల్లా.
అర్హత: 2022 -23 విద్యా సంవత్సరంలో ఏదైనా గుర్తింపు పొందిన పాఠశాల నుంచి 5వ తరగతి ఉత్తీర్ణులైన బాలురు అర్హులు.
తెలుగు/ఇంగ్లీష్ మీడియం విద్యార్థులు అర్హులు. నిర్దిష్ట శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి.
తల్లిదండ్రుల వార్షిక ఆదాయం పట్టణ ప్రాంతంలో అయితే రూ. 2 లక్షల లోపు, గ్రామీణ ప్రాంతంలో అయితే రూ. 1 లక్ష 50 వేలకు మించరాదు.
వయసు: ఏప్రిల్ 1, 2023 నాటికి 11 ఏళ్లకు మించరాదు.
ఏప్రిల్ 1, 2012 నుంచి మార్చి 31, 2014 మధ్య జన్మించి ఉండాలి.
ఎంపిక: మూడంచెల్లో ఎంపిక చేస్తారు.
స్టేజ్ 1: స్టేట్ లెవల్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ - 100 మార్కులు.
స్టేజ్ 2: స్క్రీనింగ్ టెస్టులు - 150 మార్కులు.
ఇందులో ఫిజికల్, సైనిక్ స్కూల్ ఆప్టిట్యూడ్ పరీక్ష, కమ్యూనికేషన్ స్కిల్ టెస్టులు ఉంటాయి.
స్టేజ్ 3: వైద్య పరీక్షల ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేస్తారు.
దరఖాస్తు ప్రారంభ తేదీ: జనవరి 31, 2023.
చివరి తేదీ: ఫిబ్రవరి 15, 2023.
ప్రవేశ పరీక్ష: ఫిబ్రవరి 26, 2023.
రాత పరీక్ష ఫలితాలు: మార్చి 8, 2023.
ఫిజికల్ ఫిట్నెస్ తేదీలు: మార్చి 20,22, 24,25,26/2023.
తుది ఫలితాలు: మార్చి 28, 2023.
ప్రవేశాలు ప్రారంభం: మార్చి 30, 2023.
వెబ్సైట్: https://www.tswreis.ac.in