స్టూడెంట్‌ని పాస్ చేయించిన క్రికెటర్ కోహ్లీ.. ఎలానో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

చాలా మంది విద్యార్థులు పరీక్షలు రాసేటప్పుడు ఏదైనా ఆన్సర్ మధ్యలో మర్చిపోతే, తమకి నచ్చిన సినిమా స్టోరీనో లేక ఏదైనా పాటనో రెండు మూడు లైన్లు రాసి కవర్ చేయడం మనం చూస్తూనే ఉంటాం.

Update: 2024-04-27 05:45 GMT

దిశ వెబ్ డెస్క్: చాలా మంది విద్యార్థులు పరీక్షలు రాసేటప్పుడు ఏదైనా ఆన్సర్ మధ్యలో మర్చిపోతే, తమకి నచ్చిన సినిమా స్టోరీనో లేక ఏదైనా పాటనో రెండు మూడు లైన్లు రాసి కవర్ చేయడం మనం చూస్తూనే ఉంటాం. అయితే కొందరు విద్యార్థులు మాత్రం పరీక్షల్లో జవాబులకు బదులుగా రామునికి సంబంధించిన నినాదాలు రాశారు. అలానే ప్రముఖ క్రికెటర్ల పేర్లు కూడా మెన్షన్ చేశారు.

అయినా ఆ విద్యార్థులని ప్రొఫెసర్లు పాస్ చేశారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ఉత్తరప్రదేశ్‌లోని వీర్ బహదూర్ సింగ్ పూర్వాంచల్ యూనివర్సిటీలో జరిగిన డీ ఫార్మసి పరీక్షల్లో ఆన్సర్ షీట్‌లో రామునికి సంబంధించిన నినాదాలను, అలానే ప్రముఖ క్రికెటర్లు రోహిత్ శర్మ, కోహ్లీ, హార్దిక్ వంటి ప్లేయర్ల పేర్లను స్టూడెంట్స్ రాశారు.

అయినా ఆ విద్యార్థులను ప్రొఫెసర్లు పాస్ చేశారు. కాగా డీ ఫార్మసీ చదువుతున్న విద్యార్థులు తమను పరీక్షల్లో పాస్ చేయాల్సిందిగా ప్రొఫెసర్లకు లంచం ఇచ్చినట్టు ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఇద్దరు ప్రొఫెసర్లను అధికారులు సస్పెండ్ చేశారు.

Tags:    

Similar News