Kim Jong Un: సొంత ప్యాలెస్‌‌ను కూలగొట్టుకుంటున్న కిమ్.. శాటిలైట్‌ ఫోటోలు వైరల్..!

ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ జొంగ్‌ ఉన్‌‌కు పలు విలాసవంతమైన ప్యాలెస్‌లు ఉన్నాయి.

Update: 2024-05-08 06:54 GMT

దిశ వెబ్ డెస్క్: ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ జొంగ్‌ ఉన్‌‌కు పలు విలాసవంతమైన ప్యాలెస్‌లు ఉన్నాయి. అయితే తాజాగా కిమ్‌ తన ప్యాలెస్‌‌ల్లో ఒకటైన రియోక్పో ప్యాలెస్ (Ryokpo Palace) లోని కొన్ని భవనాలను కూల్చివేశారని ఉపగ్రహాలు తీసిన ఫోటోల ఆధారంగా తెలుస్తోంది. కాగా ఈ ప్యాలెస్ కిమ్‌ విలాసవంతమైన జీవన శైలికి అద్దం పడుతుంది.

అలాంటి ఈ ప్యాలెస్‌ను త్వరలోనే కూల్చివేయనున్నారని మొదటగా నోబడీ జర్మన్ అనే పేరుతో ఉత్తర కొరియా విశ్లేషకుడు తన X వేదికగా పోస్ట్ చేశారు. కొన్ని మీడియా సంస్థల కథనాల ప్రకారం, ఉత్తర కొరియా రాజధాని ప్యోంగ్యాంగ్‌ శివార్లలో రియోక్పో ప్యాలెస్ ఉంది. కాగా కిమ్‌ శీతాకాలంలో ఈ ప్యాలెస్‌లో గడుపుతారని సమాచారం. కాగా ఈ ప్యాలెస్‌‌‌లోని కొన్ని భవనాలను తొలిగించే పనులను కిమ్‌ ఏప్రిల్ 29వ తేది నుండి ప్రారంభిస్తారని నోబడీ జర్మన్ X పోస్ట్‌లో రాసుకొచ్చారు.

కాగా నోబడీ జర్మన్ చెప్పినట్టే కిమ్‌ తన రియోక్పో ప్యాలెస్‌లోని కొన్ని భవనాలను తొలిగించినట్టు తాజాగా శాటిలైట్‌లు (ఉపగ్రహాలు) తీసిన ఫోటోల్లో కనిపించింది. అయితే గతంలో శాటిలైట్‌లు (ఉపగ్రహాలు) తీసిన ఫోటోల్లో రియోక్పో ప్యాలెస్ పై భాగం బాగా మురికిపట్టి ఉన్నట్టు కనిపించింది. అలానే సాయుధ బలగాలను ఆధునీకరించడపై ఈ మధ్యకాలంలో కిమ్‌ తీవ్రంగా శ్రమిస్తున్నారు.

ఈ నేపథ్యంలో ప్యాలెస్‌ను రీమోడల్ చేయించడం ద్వారా సైనికలకు సౌకర్యాలను కల్పించేందుకు కిమ్‌ ఈ నిర్ణయం తీసుకున్నట్టు కొందరు విశ్లషకులు భావిస్తున్నారు. 

Similar News