ఎడారి అంటే .....
ఓ థార్ గుర్తొస్తుంది
మరో సహార గుర్తొస్తుంది!
కానీ.....
ఆర్ద్రత లేని ఎద ఎడారి
పూలు పూయని తోట ఎడారి!!
ఆకలితో తల్లడిల్లుతున్న తల్లిలో
లేనీ,రానీ పాల కోసం పాప ప్రయాస పడితే
పుట్టుక ఎడారి !
ఆటలాడుకునే వయస్సులో
ఆకలి పోరాటం చేస్తే
బాల్యం ఎడారి!!
కంటిలో నీటిచుక్క ఆరితే
హృదయం ఎడారి !
'' థార్ రోడ్డు మీద రక్షణ లేకపోతే
బ్రతుకు ఎడారి !!
ఆలనా పాలనా లేని
తల్లిదండ్రులు
ఆశ్రమాలను ఆశ్రయిస్తే
జీవితం ఎడారి........!!
జగ్గయ్య.జి
డల్లాస్, అమెరికా
9849525802