యస్ బ్యాంకు కేసు: మరో ముగ్గురికి సమన్లు

యస్ బ్యాంకు వ్యవహారంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ బ్యాంకు నుంచి రుణాలు తీసుకొని తిరిగి చెల్లించడంలో విఫలమైన పలు దిగ్గజ కార్పొరేట్ కంపెనీ యజమాన్యాలకు ఈడీ సమన్లు జారీ చేసింది. తాజాగా, ఎస్సెల్ గ్రూప్ ప్రమోటర్ సుభాష్ చంద్ర గార్గ్, జెట్ ఎయిర్ వేస్ వ్యవస్థపాకుడు నరేశ్ గోయల్, ఇండియా బుల్స్ చైర్మన్ సమీర్ గెహ్లట్‌లకు సమన్లు జారీ చేసింది. వీరంతా ఈ నెల 19న వ్యక్తిగతంగా ఈడీ ఎదుట హాజరుకానున్నారు. కాగా, ఇప్పటికే […]

Update: 2020-03-16 20:28 GMT

యస్ బ్యాంకు వ్యవహారంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ బ్యాంకు నుంచి రుణాలు తీసుకొని తిరిగి చెల్లించడంలో విఫలమైన పలు దిగ్గజ కార్పొరేట్ కంపెనీ యజమాన్యాలకు ఈడీ సమన్లు జారీ చేసింది. తాజాగా, ఎస్సెల్ గ్రూప్ ప్రమోటర్ సుభాష్ చంద్ర గార్గ్, జెట్ ఎయిర్ వేస్ వ్యవస్థపాకుడు నరేశ్ గోయల్, ఇండియా బుల్స్ చైర్మన్ సమీర్ గెహ్లట్‌లకు సమన్లు జారీ చేసింది. వీరంతా ఈ నెల 19న వ్యక్తిగతంగా ఈడీ ఎదుట హాజరుకానున్నారు. కాగా, ఇప్పటికే రిలయన్స్ అడాగ్ చైర్మన్ అనిల్ అంబానీ, డీహెచ్‌ఎఫ్ఎల్ సీఎండీ కపిల్ వాద్వాన్‌లకు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. వీరంతా యస్ బ్యాంకు నుంచి రుణాలు తీసుకొని చెల్లించడంలో విఫలమయ్యారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.

Tags: yes bank, ED, summons, jet airways, indiabulls

Tags:    

Similar News