తయారీ ఎక్కడో చెప్పకపోతే జరిమానా

దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర ప్రభుత్వం ఈ-కామర్స్ కంపెనీలకు షాక్ ఇచ్చింది. ఉత్పత్తి చేసిన వస్తువు ఎక్కడ తయారు చేశారనే విషయాన్ని వెబ్‌సైట్‌లో తప్పనిసరిగా ఉంచాలని కీలకమైన ఆదేశాలను ఇచ్చింది. అలా లేకుంటే రూ. లక్ష జరిమానా, లేదా ఒక ఏడాది జైలు అనుభవించాల్సి వస్తుందని హెచ్చరించింది. దీనికోసం జులై చివరి వరకూ గడువు ఇస్తూ, ఆగష్టు 1 నుంచి తప్పనిసరిగా ఈ నిబంధనను ఈ-కామర్స్ కంపెనీలు పాటించాలని తెలిపింది. దీనికోసం సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటక్షన్ అథారిటీ(సీసీపీఏ)ను ఏర్పాటు […]

Update: 2020-07-10 07:37 GMT

దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర ప్రభుత్వం ఈ-కామర్స్ కంపెనీలకు షాక్ ఇచ్చింది. ఉత్పత్తి చేసిన వస్తువు ఎక్కడ తయారు చేశారనే విషయాన్ని వెబ్‌సైట్‌లో తప్పనిసరిగా ఉంచాలని కీలకమైన ఆదేశాలను ఇచ్చింది. అలా లేకుంటే రూ. లక్ష జరిమానా, లేదా ఒక ఏడాది జైలు అనుభవించాల్సి వస్తుందని హెచ్చరించింది. దీనికోసం జులై చివరి వరకూ గడువు ఇస్తూ, ఆగష్టు 1 నుంచి తప్పనిసరిగా ఈ నిబంధనను ఈ-కామర్స్ కంపెనీలు పాటించాలని తెలిపింది. దీనికోసం సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటక్షన్ అథారిటీ(సీసీపీఏ)ను ఏర్పాటు చేస్తున్నట్టు వినియోగదారుల మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

వినియోగదారుల రక్షణ చట్టాన్ని అతిక్రమిస్తే అథారిటీ తగిన చర్యలు తీసుకుంటుందని, సుమోటోగా కేసును స్వీకరిస్తుంది. స్థానిక ఉత్పత్తులకు ప్రచారం కల్పించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నామని వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ తెలిపారు. విక్రయదారులు ఏదైన వస్తువు ఎక్కడ తయారైందో చెప్పాల్సిన అవసరముందని, ఒకవేళ అలా తెలియజేయకపోతే మొదటిసారి రూ. 25 వేలు, రెండవసారి జరిగితే రూ. 50 వేలు జరిమాన చెల్లించాల్సి ఉంటుందని వినియోగదారుల వ్యవహారాల కార్యదర్శి లీనా నందన్ వివరించారు. మూడవసారి కూడా అదే పొరపాటు కొనసాగితే రూ. లక్ష జరిమానా కట్టాల్సి వస్తుందని లేదంటే ఏడాదిపాటు జైలుకు వెళ్లాల్సి వస్తుందని స్పష్టం చేశారు. కొన్ని సందర్భాల్లో జరిమానా, జైలు రెండూ తప్పవని పేర్కొన్నారు.

Tags:    

Similar News