అన్నపూర్ణ భోజనాలకు ఇబ్బంది రానివ్వొద్దు

దిశ, న్యూస్‌బ్యూరో: ఎంతో మంది పేదల కడుపు నింపుతున్న ‘అన్నపూర్ణ’ భోజనాలకు ఇబ్బంది రానివ్వొద్దని అక్షయపాత్ర నిర్వాహకులకు పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్ స్పష్టం చేశారు. లాక్‌డౌన్ కాలంలో బియ్యం, ఉప్పు, పప్పు తదితర నిత్యావసర వస్తువుల రవాణాకు ఎదురవుతున్న ఇబ్బందుల గురించి ఆయన స్వయంగా అక్షయపాత్ర నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. హోటళ్లన్నీ మూతపడడంతో ఫుట్ పాత్‌ల మీద ఉండేవారికి, మురికివాడల్లో నివసిస్తున్నవారికి అన్నపూర్ణ భోజనం కడుపు నింపుతోందని, దీన్ని మరింత ఎక్కువ స్థాయిలో […]

Update: 2020-04-22 08:47 GMT

దిశ, న్యూస్‌బ్యూరో: ఎంతో మంది పేదల కడుపు నింపుతున్న ‘అన్నపూర్ణ’ భోజనాలకు ఇబ్బంది రానివ్వొద్దని అక్షయపాత్ర నిర్వాహకులకు పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్ స్పష్టం చేశారు. లాక్‌డౌన్ కాలంలో బియ్యం, ఉప్పు, పప్పు తదితర నిత్యావసర వస్తువుల రవాణాకు ఎదురవుతున్న ఇబ్బందుల గురించి ఆయన స్వయంగా అక్షయపాత్ర నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. హోటళ్లన్నీ మూతపడడంతో ఫుట్ పాత్‌ల మీద ఉండేవారికి, మురికివాడల్లో నివసిస్తున్నవారికి అన్నపూర్ణ భోజనం కడుపు నింపుతోందని, దీన్ని మరింత ఎక్కువ స్థాయిలో అమలుచేయాలని సూచించారు. నార్సింగిలోని అక్షయపాత్ర ఫౌండేషన్​ను సందర్శించిన అరవింద్ కుమార్.. ఆహార పదార్ధాలను అన్నపూర్ణ క్యాంటీన్‌లకు తరలించడంలో వస్తున్న ఇబ్బందులపై ఆరా తీశారు.

రాష్ట్రంలో ఏ ఒక్కరూ పస్తులుండరాదన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు అరవింద్ కుమార్ అన్నపూర్ణ భోజనాలపై దృష్టి పెట్టారు. కిచెన్‌లో తయారవుతున్న ఆహారపదార్ధాలను, వంటల తయారీ పద్దతులను స్వయంగా చూసి నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో సుమారు 200 అన్నపూర్ణ కేంద్రాల ద్వారా ప్రతిరోజు సుమారు లక్షన్నర మందికి మధ్యాహ్నం లంచ్​, రాత్రి డిన్నర్​‌కు భోజనాలను అందిస్తున్నట్లు వారు అరవింద్ కుమార్‌కు తెలిపారు. నార్సింగ్ సర్కిల్ వద్ద జరుగుతున్న ఔటర్​ రింగ్​ రోడ్డు పనులను పరిశీలించిన అరవింద్ కుమార్ ఇంటర్​ సర్కిల్​ వద్ద గ్రీనరీ బ్యూటిఫికేషన్​ పనులు త్వరితగతిన పూర్తిచేయాలని హెచ్​ఎండీఏ అర్బన్​ ఫారెస్ట్రీ అధికారులను ఆదేశించారు. అటు శంషాబాద్​ ఇంటర్​‌చేంజ్​ బ్యూటిఫికేషన్​ పనులను, ఐకియా సర్కిల్​ దగ్గర హెచ్​ఎండీఏ చేస్తున్న గ్రీనరీ బ్యూటిఫికేషన్​ పనులను సైతం పరిశీలించారు. ఆయనతో పాటు హైదరాబాద్​ గ్రోత్​ కారిడార్​ లిమిటెడ్​ (హెచ్​జీసీఎల్​) ఎండీ సంతోష్​, హెచ్​ఎండీఏ చీఫ్​ ఇంజినీర్​ బీఎల్​ఎన్​ రెడ్డి, అర్బన్​ ఫారెస్ట్రీ డీఎఫ్​ఓ ప్రకాశ్​ ఉన్నారు.

tags: GHMC, MAUD Secretary, Akshayapatra, Kitchen, LockDown, Annapurna Meals, Narsingi

Tags:    

Similar News